• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుక్కూ వల్ల స్టార్...

సుక్కూ వల్ల స్టార్ అయ్యా.. టెర్రస్ పై అదే మాట్లాడాం: బన్నీ

| తన జీవితంలో సుకుమార్ చాలా మార్పు తీసుకొచ్చారని తాను ఎప్పుడూ చెప్పుకుంటానని బన్నీ తెలిపారు. ఇప్పుడు ఈ ఈవెంట్ లో సుకుమార్ ను మిస్ అవుతున్నట్లు చెప్పారు.

By - Tupaki Desk
Update: 2024-11-29 13:39 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2 మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ముంబైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా.. బన్నీ సుకుమార్ తో తన అనుబంధాన్ని పంచుకున్నారు.

దర్శకుడు సుకుమార్‌ తో తనది 20 ఏళ్ల ప్రయాణమని తెలిపారు అల్లు అర్జున్. తన రెండో సినిమా అయిన ఆర్యకు ఆయనే డైరెక్టర్ అని గుర్తు చేశారు. తాను ఈ రోజు స్టేజీపై అందరి ముందు నిలబడ్డాను అంటే సుకుమారే కారణమని చెప్పారు. ఆయన వల్లే స్టార్‌ అయ్యా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అన్నారు అల్లు అర్జున్.

తన జీవితంలో సుకుమార్ చాలా మార్పు తీసుకొచ్చారని తాను ఎప్పుడూ చెప్పుకుంటానని బన్నీ తెలిపారు. ఇప్పుడు ఈ ఈవెంట్ లో సుకుమార్ ను మిస్ అవుతున్నట్లు చెప్పారు. ఆయనను అద్భుతమైన డైరెక్టర్ గా కొనియాడారు. ఆయన ఇక్కడే లేరంటే దాని బట్టి డెడికేషన్ ఏంటో అర్థమవుతోందని సుక్కును ప్రశంసించారు.

ప్రస్తుతం సుకుమార్ సినిమా పనులతో బిజీగా ఉన్నారని అల్లు అర్జున్ తెలిపారు. ఇంకా బెటర్ గా అవుట్ పుట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారని చెప్పారు. తాము సినిమా ఎంత కలెక్షన్లు సాధిస్తుందని, ఎంత ఖర్చు పెడుతున్నామన్న విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని వెల్లడించారు. పుష్ప కోసం టీమ్ అంతా ఐదేళ్ల వెచ్చించామన్నారు.

అందులో పుష్ప 2కే మూడేళ్లు పట్టిందని తెలిపారు. తమను నమ్మండని.. సీక్వెల్ మూవీ కూడా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు. కచ్చితంగా మీ హార్ట్స్ ను టచ్ చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత సుకుమార్ తో తన ఆఫీస్ టెర్రస్ పై దిగిన పిక్ కోసం మాట్లాడారు అల్లు అర్జున్. అది ఎప్పుడు తీసుకున్నారో చెప్పారు.

అప్పుడు తాను పాత బిల్డింగ్ ను కూల్చి కొత్త ఆఫీస్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. అందులో ఫస్ట్ పుష్ప మీటింగ్ ను సుకుమార్ తో నిర్వహించానని చెప్పారు. అప్పుడు ఆఫీస్ ఇంకా పూర్తిగా నిర్మించలేదని.. టెర్రస్ పై ఛాయ్ తాగి మాట్లాడుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. 2020లో దిగిన పిక్ అని, అదొక మెమరీ అని తెలిపారు.

Sukumar made me a Star. Undoubtedly He made the Biggest Difference in my life.- #AlluArjun about #Sukumar at #Pushpa2IconicPressMeet in Mumbai#Pushpa2TheRule #Pushpa2 #Pushpa2TheRuleOnDec5th #Tupaki pic.twitter.com/FgG0Cf4GId

— Tupaki (@tupaki_official) November 29, 2024
Tags:    
  • Alluarjun 
  • Sukmar 
  • Rashmikamandanna 
  • Pushpa2 
  • Pushpa2IconicPressMeet 
  • Mumbai 
  • Panindianfilm 
  • Mythrimoviemakers 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS