• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇక ఆశలన్నీ వచ్చే ఏడాది...

ఇక ఆశలన్నీ వచ్చే ఏడాది చిత్రాలపైనే..!

| సంక్రాంతి మొదలుకుని సమ్మర్‌, దసరా ఇతర సీజన్‌ లలో టాలీవుడ్ స్టార్‌ హీరోల సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ విడుదల అవ్వబోతున్నాయి.

By - Tupaki Desk
Update: 2023-09-10 01:30 GMT

సినిమా ఇండస్ట్రీకి 2023 సంవత్సరం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా నిలిచింది. ఈ ఏడాదిలో మరో మూడు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మూడు నెలల్లో గొప్ప చిత్రాలు, అధ్బుతమైన ఇండస్ట్రీ హిట్‌ చిత్రాలు వస్తాయనే నమ్మకం ఏ ఒక్కరిలో కనిపించడం లేదు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల మాదిరిగానే ఒక మోస్తరు గా ఇక ముందు రాబోయే సినిమాలు ఉంటాయేమో.

ఈ ఏడాది లో ఇండస్ట్రీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అనే పదాలు పెద్దగా వినిపించలేదు. ఏడాది ఆరంభంలో చిరంజీవి ఇంకా బాలకృష్ణ లు సందడి చేశారు కానీ ఆ తర్వాత యంగ్‌ హీరోలు, సీనియర్‌ హీరోలు ఎవరు కూడా పెద్దగా సక్సెస్‌ లు దక్కించుకున్న దాఖలాలు లేవు. కనుక సినీ ప్రేక్షకులు మరియు ప్రేమికులు వచ్చే ఏడాది సినిమాల కోసం వెయిటింగ్‌ చేస్తున్నారు.

వచ్చే ఏడాది ఆరంభం లోనే మహేష్‌ బాబు సినిమా గుంటూరు కారం విడుదల కాబోతుంది. ప్రాజెక్ట్‌ కే 'కల్కి' సినిమా కూడా సంక్రాంతికి రావాల్సి ఉన్నా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త లేట్‌ అయినా కూడా సమ్మర్‌ లో కల్కి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా సమ్మర్ లో పుష్ప 2 మరియు దేవర సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

సంక్రాంతి మొదలుకుని సమ్మర్‌, దసరా ఇతర సీజన్‌ లలో టాలీవుడ్ స్టార్‌ హీరోల సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ విడుదల అవ్వబోతున్నాయి. ఈ ఏడాది మిస్‌ చేసుకున్న రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు ఇంకా పలువురు స్టార్‌ హీరోల సినిమాలు వచ్చే ఏడాది లోనే విడుదల అవ్వబోతున్నాయి. కనుక అభిమానులు చాలా ఆసక్తిగా వచ్చే ఏడాది వైపు చూస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Movies 
  • Panindia 
  • Sankranti 
  • Release 
  • Gunturkaram 
  • Prabhas 
  • Kalki 
  • Alluarjun 
  • Pushpa2 
  • Ramcharan 
  • Ntr 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS