వీడియో: ఆదమరిచిన ఆలియాను ఇలా చిత్రీకరించారేమిటీ?
సెలబ్రిటీల వ్యక్తిగత, ప్రయివేట్ జీవితాలను మీడియా వ్యక్తులు వెంబడించడం కొత్త విషయం కాదు.;
సెలబ్రిటీల వ్యక్తిగత, ప్రయివేట్ జీవితాలను మీడియా వ్యక్తులు వెంబడించడం కొత్త విషయం కాదు. అయితే ఒక్కోసారి హద్దు మీరి ఫోటోలు వీడియోల కోసం పాకులాడటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. గతంలో తన ఇంటి మేడపై ఉన్నప్పుడు పక్క మేడ పైనుంచి తనను కెమెరాతో షూట్ చేస్తున్నాడంటూ ఒక వ్యక్తిపై ఆలియా ఆరోపించడం తీవ్ర అలజడి రేపింది.
తన ఇంట్లో ఉన్నప్పుడు ఫోటోలు తీయడంతో తనకు ప్రైవసీ అనేది లేకుండా పోయిందని ఆలియా తీవ్రంగా ఆరోపించారు. అప్పటి పోస్ట్‌లో ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేసి ``ఈరోజు అన్నిరకాలుగా హద్దులు దాటారు``అని ఫిర్యాదు చేసారు. ఆలియా ఫోటోగ్రాఫర్ల అతికి చాలాసార్లు కోపోద్రిక్తురాలైంది. ఆలియా భర్త రణబీర్ కపూర్ కూడా రాహా కపూర్ విషయంలో ఫోటోగ్రాఫర్ల తీరుపై విరుచుకుపడ్డారు.
ప్రతిసారీ సెలబ్రిటీల విషయంలో ఫోటోగ్రాఫర్లు చేయకూడని తప్పులు చేస్తున్నారా? అంటే ఒక్కోసారి పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని అంగీకరించాల్సి ఉంటుంది. సెలబ్రిటీ లైఫ్ ని పరిధి దాటనంత వరకూ డాక్యుమెంట్ చేయడంలో తప్పు లేదు. వ్యక్తిగతంగా బెడ్ రూమ్ ఫోటోలను వెంబడించి మరీ తీయాల్సిన అవసరం లేదు. లేదా ఇంట్లో ఒంటరిగా ఉన్నవారిని పక్కింటి మేడపై కెమెరా అమర్చి అదే పనిగా పీపింగ్ టామ్ లా ఫోటోలు వీడియోలు తీయాల్సిన పని లేదు. అది చట్టబద్ధంగా కూడా సమస్యలను కొని తెస్తుంది.
ఇప్పుడు ఆలియా భట్ చిట్టి పొట్టి దుస్తుల్లో బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను పాపులర్ బాలీవుడ్ మీడియా ఆన్ లైన్ లో షేర్ చేసింది. ఆలియా ఆ సమయంలో ఆదమరిచి ఆటలాడటంలో బిజీగా ఉంది. ఆలియా భట్ పర్ఫెక్ట్ ఫిట్ బాడీని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇది అసభ్యకరమైనది కాదు. కానీ వ్యక్తిగతంగా దీనిని ఆలియా అనుమతితో చిత్రీకరించారా? అన్నది సందిగ్ఢతను రేకెత్తిస్తోంది. వెల్.. ఆలియా దీనికి ఫిర్యాదు చేయకపోతే వారు చేసినది రైట్. ఫిర్యాదు చేస్తేనే రాంగ్!!
అయితే టాలీవుడ్ లో ఇలాంటి కల్చర్ దాదాపు జీరో. ఫోటోగ్రాఫర్లు హద్దులు మీరి అనవసరంగా కథానాయికలను వల్గారిటీ కోణంలో చూపించడం అరుదు. కొంత డీసెన్సీ.. మరికొంత ఫ్రెండ్షిప్. మన ఫోటోగ్రాఫర్ల స్టైల్. అందువల్ల ఎప్పుడూ ఇక్కడ అంతగా ఫిర్యాదులు రాలేదు.