పెద్ద కట్టుతో కనిపించిన అలీ.. అసలు విషయం ఇదే!

అయితే, ఈ వీడియో వెనుక అసలు కథ వేరే ఉందని తెలిసిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Update: 2026-09-03 06:24 GMT

టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ తాజాగా కాలికి పెద్ద కట్టుతో కనిపించడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో అలీ కాలికి భారీ బ్యాండేజ్ ఉండటం చూసిన నెటిజన్లు ఆయనకు నిజంగానే ఏదైనా ప్రమాదం జరిగిందా అంటూ ఆరా తీయడం ప్రారంభించారు. అయితే, ఈ వీడియో వెనుక అసలు కథ వేరే ఉందని తెలిసిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అలీ ప్రస్తుతం దాదీ కీ షాదీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన కీలక ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్న టైమ్ లోనే ఈ వీడియో బయటకు వచ్చింది. కథలో భాగంగా అలీ కాలు విరిగినట్లు చూపించే సీన్ ను మేకర్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. అందుకే షూటింగ్ కోసం ఆయన కాలికి పెద్ద కట్టు కట్టారు. అయితే, ఆ విజువల్‌ను సందర్భం తెలియకుండా చూసిన వారికి మాత్రం అలీ నిజంగానే గాయపడినట్లు అనిపించింది.

ఇదే సమయంలో అలీ భార్య జుబేదా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఈ విషయాన్ని మరింత వైరల్ చేసింది. షూటింగ్ గ్యాప్‌లో చిత్ర యూనిట్ అలీ కోసం ఏర్పాటు చేసిన లంచ్‌ను ఆమె వీడియో ద్వారా చూపించారు. అయితే, కాలికి కట్టు కట్టుకుని ఉన్న అలీని చూపిస్తూ జుబేదా చేసిన సరదా కామెంట్ నెటిజన్లను ఆకట్టుకుంది. “అలీకి కాలు విరిచేసి లంచ్ పెట్టిన యూనిట్” అంటూ ఆమె సరదాగా పేర్కొనడంతో ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

జుబేదా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితమే. ముఖ్యంగా యూట్యూబ్ వీడియోల ద్వారా ఆమె మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇంట్లో చేసే వంటలు, అలీకి ఇష్టమైన ఫుడ్, ఫ్యామిలీతో గడిపే మూమెంట్స్ ను వీడియోల రూపంలో ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఆమె రెగ్యుల‌ర్ యాక్టివ్‌గా ఉంటారు.

తాజాగా షేర్ చేసిన ఈ వీడియోలో కూడా సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ చిన్న సందర్భాన్ని తనదైన సరదా శైలిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు జుబేదా. ఒకవైపు సినిమా కోసం కాలు విరిగినట్లు నటిస్తున్న అలీ, మరోవైపు షూటింగ్ బ్రేక్‌లో యూనిట్ ఏర్పాటు చేసిన లంచ్‌ను ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి, పెద్ద కట్టుతో కనిపించిన అలీకి నిజంగా ప్రమాదం జరగలేదని తెలిసి అభిమానులు రిలీఫ్ ఫీల‌వుతున్నారు. సినిమా సీన్ కోసం వేసిన ఆ కట్టే సోషల్ మీడియాలో మాత్రం ఊహించని డిస్క‌ష‌న్‌కు కారణమైంది.



Tags:    

Similar News