టీనేజర్స్ టార్గెట్.. 13 ఏళ్ల నా కూతుర్ని కూడా వదల్లేదు -అక్షయ్ కుమార్
అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అని కొట్టి పారేస్తుంటే.. కానీ ఇది నిజమే అంటూ తాజాగా అక్షయ్ కుమార్ స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.;
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన సౌత్,నార్త్ రెండు ఇండస్ట్రీలలో కూడా సుపరిచితుడే.. అయితే అలాంటి అక్షయ్ కుమార్ కూతుర్ని ఓ అపరిచితుడు నగ్న ఫోటోలు పంపమని అడిగారట.. అంత పెద్ద స్టార్ బయటికి వస్తే ఎంతో మంది బాడీగార్డ్ లతో బయటకు వస్తాడు. అలాంటి అక్షయ్ కుమార్ కూతుర్నే నగ్న ఫోటోలు పంపమని అడిగారంటే నిజంగా ఇది షాకింగ్ ఘటనే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అని కొట్టి పారేస్తుంటే.. కానీ ఇది నిజమే అంటూ తాజాగా అక్షయ్ కుమార్ స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో అక్షయ్ కుమార్..
తాజాగా అక్షయ్ కుమార్ ముంబైలో ఏర్పాటుచేసిన సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొని ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆయన ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. "సైబర్ నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి బాధాకరమైన అనుభవాన్ని నా కూతురు కూడా అనుభవించింది. కొన్ని నెలల క్రితం మా ఇంట్లో ఓ చిన్న సంఘటన జరిగింది. నా కూతురు ఆన్లైన్లో ఓ వీడియో గేమ్ ఆడుతోంది. ఈ మధ్యకాలంలో కొన్ని ఆన్లైన్ వీడియో గేమ్స్ అపరిచితులతో ఆడుకోవడానికి కూడా వీలు కలిగేలా ఉన్నాయి. ఆ సమయంలో నా కూతురు వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఓ అపరిచిత వ్యక్తి నువ్వు అమ్మాయా లేక అబ్బాయా అని అడిగారు.
నగ్న వీడియోలు పంపమని నా కూతుర్ని బెదిరించారు..
దానికి మా అమ్మాయి నేను అమ్మాయిని అని చెప్పడంతో అమ్మాయి అయితే నీ నగ్న ఫొటోస్ నాకు పంపించు అంటూ సందేశం పంపాడట. ఆ వ్యక్తి అలా అడగడంతోనే నా కూతురు వెంటనే ఆ వీడియో గేమ్ నుండి బయటికి వచ్చి స్విచ్ ఆఫ్ చేసేసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని నా భార్యకు చెప్పింది.అలా నా భార్య ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఇది కూడా సైబర్ నేరంలో ఒక భాగమే.అందుకే సైబర్ నేరాల నుండి పిల్లల్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోరుతున్నాను. మహారాష్ట్ర లోని స్కూళ్లలో 7, 8, 9,10 తరగతిలో చదివే విద్యార్థులకు వారానికి ఒక్కసారైనా సైబర్ పీరియడ్ ఉండాలని నేను సీఎంని అభ్యర్థిస్తున్నాను.
పిల్లల్లో సైబర్ నేరాలపై అవేర్నెస్ కల్పించాలి..
ఈ ఏజ్ లో ఉన్న పిల్లలకి సైబర్ నేరాల గురించి బోధించాలి. సైబర్ నేరాలను ఆపడం చాలా ఇంపార్టెంట్.. ఈ సైబర్ నేరాలు వీధి నేరాల కంటే తొందరగా పెరుగుతున్నాయి.. ముఖ్యంగా టీనేజ్ యువతని వీరు టార్గెట్ చేస్తారు.. కాబట్టి ఇలాంటి విషయాలలో పిల్లలకు అవేర్నెస్ తప్పనిసరి" అంటూ సైబర్ నేరాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. అలా ఎంతోమంది చిన్న పిల్లలు ఇలాంటి సైబర్ నేరగాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తన కూతురి విషయాన్ని ఉదాహరణగా తీసుకొని సైబర్ నేరాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని అక్షయ్ కుమార్ హెచ్చరించారు.