ఆపరేషన్ సిందూర్.. స్టార్ హీరోపై ఎఫెక్ట్?
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే.;
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను భారత్ మట్టి కురిపించింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. తమ ఆయుధాలతో దాయాది దేశానికి చుక్కలు చూపించింది. దాయాది దేశం కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది.
అయితే ఆపరేషన్ సిందూర్ మొదలైన క్షణం నుంచి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎక్కడ చూసినా అందుకు సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి. అదే సమయంలో అనేక సెలబ్రిటీలు కూడా భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలపై రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఆ విధంగా మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ మూవీతో జై హింద్.. జై మహాకాల్ అంటూ రాసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ఫాలోవర్స్ ఒక్కసారిగా తగ్గిపోయారు. పోస్ట్ చేశాక.. అక్షయ్ 4.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను కోల్పోయినట్లు తెలుస్తోంది.
అయితే అక్షయ్ ను అన్ ఫాలో చేసింది పాకిస్థాన్ యూజర్స్ అనే తెలుస్తోంది. ఆయనతోపాటు మరికొందరు ఇండియన్ సెలబ్రిటీలు కూడా రాత్రికి రాత్రే లక్షలాది మంది అనుచరులు కోల్పోయారని సమాచారం. అందులో అక్షయ్ కుమార్, అలియా భట్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ సహా పలువురు నటీనటులు ఉన్నారు.
కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ నటీనటులు మహిరా ఖాన్, ఫవాద్ ఖాన్, హనియా అమీర్ వంటి అనేక మంది భారత్ చేసిన దాడిపై పోస్టులు పెట్టారు. పిరికితనమంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారందరినీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకున్నారు నెటిజన్లు. ఫుల్ గా కామెంట్స్ పెట్టారు.
అయితే ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. వారిని తక్షణమే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని పిలుపు నిచ్చింది. కళల పేరుతో ఇలాంటివారికి గుడ్డిగా అస్సలు మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్ కోరింది. ఇండియన్స్ వారిని అభిమానించొద్దని అభ్యర్థించింది. దీంతో వారికి గట్టి షాకే ఎదురైంది.