అన్నింటికంటే లైఫ్ లో అదే ముఖ్యం
జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో అక్షయ్ కుమార్;
జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో అక్షయ్ కుమార్. ఫ్యాన్స్ కు ఎప్పుడూ చేరువలో ఉండాలనే ఆలోచనతో ఆయన సంవత్సరానికి కనీసం రెండు సినిమాలైనా రిలీజయ్యేలా చూసుకుంటారు. అందులో భాగంగానే ఆయన లైనప్ లో ఎప్పుడూ సినిమాలుంటూనే ఉంటాయి. వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని ఫ్లాపులుగా నిలుస్తాయి.
అన్నింటికంటే మనశ్శాంతే ముఖ్యం
సినిమా చేయడం వరకే మన చేతిలో ఉంటుంది, తర్వాత ఏదీ మన చేతుల్లో ఉండదని నమ్మే అక్షయ్ కుమార్ రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. లైఫ్ లో డబ్బు, సక్సెస్, ఫేమ్ వీటన్నింటినీ మించింది మనశ్శాంతి అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. మనిషికి డబ్బు అవసరమే కానీ, డబ్బు కంటే మనశ్శాంతి చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రశాంతంగా లేకపోతే దేనికీ అర్థముండదు
లైఫ్ లో తాను ఎన్ని సినిమాలు చేసినా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికే ట్రై చేస్తానని, ప్రశాంతంగా లేనప్పుడు ఎంత సక్సెస్ అయినా, ఎంత డబ్బున్నా వాటికి అర్థముండదని చెప్పారు. అదే కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ మీ కూతురుకు డబ్బు కు సంబంధించిన ప్రాముఖ్యతను నేర్పిస్తారా అని అడగ్గా, దానికి అక్షయ్ కుమార్ తనదైన శైలిలో ఆన్సరిచ్చారు.
రిలీజ్ కు సిద్ధంగా భూత్ భంగ్లా
డబ్బు గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఎవరూ నేర్పించే పన్లేదని, అయినా ఒకరు నేర్పితే ఏదీ రాదని, ఏ విషయాన్నైనా ఎవరికి వారే నేర్చుకోవాలని, తెలుసుకోవాలని ఆయన చెప్పారు. అందరూ పని చేసేది డబ్బు కోసమే కాబట్టి ఎవరూ దాని ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదని, అయితే డబ్బు ముఖ్యమైనదే అయినప్పటికీ దానికంటే మనశ్శాంతి ముఖ్యమైనదని, ఈ రెండింటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోమంటే తాను మనశ్శాంతినే ఎంచుకుంటానని ఆయన చెప్పారు. ఇక అక్షయ్ కెరీర్ విషయానికొస్తే, ఆయన నటించిన భూత్ భంగ్లా సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హార్రర్ కామెడీతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్న అక్షయ్ కుమార్, తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రీమేక్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.