అలా నటించి బోర్ కొట్టింది.. అందుకే కూలీలోల ఇలా : నాగ్
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్ లో అనేక పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. కానీ అవన్నీ హీరో పాత్రలే.;
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్ లో అనేక పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. కానీ అవన్నీ హీరో పాత్రలే. అయితే కెరీర్ లో తొలిసారిగా ఆయన.. రజనీకాంత్ కూలీ సినిమా కోసం విలన్ గెటప్ వేశారు. ఈ సినిమాలో నాగ్ సైమన్ గా విలన్ రోల్ లో కనిపించనున్నారు. ఈ పాత్రపై ఆయన తాజాగా మాట్లాడారు. మూవీ టీమ్ తాజాగా పాల్గొన్న మీడియా చిట్ చాట్ లో నాగ్ ఈ కామెంట్స్ చేశారు.
ప్రతీ సినిమాలో మంచివాడిలాగా నటించి, నటించి బోర్ కొట్టిందని నాగార్జున అన్నారు. అందుకే ఈ సినిమాలో విలన్ పాత్ర చేసినట్లు చెప్పారు. అయితే ఈ పాత్రకు తనను ఒప్పించేందుకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ దాదాపు 7-8 సార్ల కలిసినట్లు నాగ్ తెలిపారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి అని చెప్పారు.
ప్రతీ సినిమాలో మంచి పాత్రలు చేసి నాకు బోర్ కొట్టింది. అందుకే ఇందలో విలన్ గా చేశాను. లోకేశ్, అనిరుధ్ తో కలిసి పని చేసేందుకు ఎదురుచూశా. ఈ సినిమాలో అనిరుధ్ నాకు ఐయామ్ ది డేంజర్ అనే పాటను కంపోజ్ చేశాడు. లోకేశ్ కూడా దానికి రాన్ డమ్ గా మ్యాజిక్ యాక్ చేశాడు. ఈ ఔట్ పుట్ బాగా వచ్చింది. స్పెషల్ గా ఈ బ్యాడ్ పాత్రకు అద్భుతంగా సెట్ అయ్యింది. అని అన్నారు. కాగా, ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా బ్యాడ్ గా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి తన మనవళ్లకు చెప్పాలని అనుకోవడం లేదని అన్నారు.
కాగా, ఈ సినిమాలో నాగ్ సైమన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటిగాకా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఆయన ఇందులో మానవుల అవయవాల అక్రమ రవాణా చేసే ముఠాకు లీడర్ గా కనిపించనున్నారు. ఆయన చేసే అక్రమా రవాణా గురించి హీరోయిన్ శ్రుతి హాసన్ ఆందోళన చెంది.. హీకో రజనీకాంత్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తుంది. దీంతో నాగ్- రజనీ మధ్యలో అసలైన సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.
ఇక లోకేశ్ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో రజనీ, నాగార్జున తోపాటు ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ తదితరులు నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమా రూపొందించారు. ఇది ఆగస్టు 14న రిలీజ్ కానుంది.