పెళ్లైన తర్వాత తొలి రిలీజ్ అఖిల్ కి కలిసొచ్చేనా?
అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ లో సరైన సక్సస్ ఏది అంటే ఇంత వరకూ చెప్పుకునే చిత్రం ఒకే ఒక్కటి.;
అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ లో సరైన సక్సస్ ఏది అంటే ఇంత వరకూ చెప్పుకునే చిత్రం ఒకే ఒక్కటి. అదే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. ఈ సినిమా మినహా చేసిన సినిమాలన్నీ వృద్దా ప్రయత్నాలుగానే కనిపిస్తాయి. కొన్ని చిత్రాలు యావరేజ్ గా ఆడినప్పటికీ అక్కినేని రేంజ్ చిత్రాలు కావవి. 'ఏజెంట్' తో యాక్షన్ స్టార్ అవుతాడు అనుకున్నారు. కానీ ఆ సినిమా పరాజయం అఖిల్ ను అంతకంతకు కిందకు లాగేసింది. ఇలా ఇన్ని పరాజయాలు అఖిల్ వేగాన్ని కూడా తగ్గించాయి. నాటి నుంచి కథలు..దర్శకుల విషయంలో సెలక్టివ్ గా ఉండటం మొదలు పెట్టాడు.
వాళ్లందరికీ ఇది షాక్:
మునుపటిలా తొందరపడి ఏ సినిమాకు ఒకే చెప్పడం లేదు. అవసరమైతే ఇంట్లో వారి సలహాలు తీసుకుంటున్నాడు. తన నిర్ణయాలపై నే కాకుండా? పెద్దవారిని కూడా సంప్రదించి అందరికీ ఒకే అనుకుంటనే ముందుకెళ్లడం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అఖిల్ పెళ్లి కూడా జరిగింది. పెద్దలు చూసిన అమ్మాయినే అఖిల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ ఇండస్ట్రీకి వచ్చిన వేగం చూసి ప్రేమలో పడి ఆ తరహా వివాహనికే ఆసక్తి చూపిస్తాడనే విశ్లేషణలు ఆరంభంలో వ్యక్తమయ్యాయి. కానీ వారందరికీ షాక్ ఇచ్చి డాడ్ చూసిన సంబంధాన్నే చేసుకున్నాడు.
రాయలసీమ నేపథ్యమే కొత్తగా:
వివాహమైతే జీవితంలో కొన్ని కొన్ని మార్పులు వస్తాయంటారు. మరి అఖిల్ విషయంలో ఎలాంటి ఛెంజెస్ వస్తాయో చూడాలి. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఏజెంట్' ప్లాప్ తర్వాత కమిట్ అయిన చిత్రమిది. అలాగే పెళ్లైన తర్వాత రిలీజ్ అవుతున్న తొలి చిత్రం కూడా ఇదే. దీంతో 'లెనిన్' సక్సస్ పై అక్కినేని కుటుంబమే కాదు ఆయన అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అఖిల్ పెద్ద విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. `లెనిన్` కథ కూడా రొటీన్ కు భిన్నమైన చిత్రమేమి కాదు.
వివాహం తో కొత్త ప్రయాణం:
రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఓ కుటుంబ నేపథ్యంలో సాగే కథనే కొత్తగా చెప్పబోతున్నారు. సీమ యువకుడి పాత్రలో అఖిల్ నటించడం అన్నది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది? అనడంలో ఎలాంటి సందేహం లేదు. `లెనిన్` కూడా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాగానే కనిపిస్తోంది. సెట్స్ కు వెళ్లి కొన్ని నెలలు గడుస్తున్నా? షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఇదే సమయంలో అఖిల్ పెళ్లి కూడా చేసుకోవడంతో మరింత గ్యాప్ ఏర్పడింది. వివాహం..హానీమూన్ అంటూ సెలవులు తీసుకున్నాడు. ప్రస్తుతం మాత్రం సెట్స్ కు హాజరవుతున్నాడు అనుకోండి.