ఏజెంట్ తర్వాత అఖిల్.. 'బంగారు తల్లి' ఫుల్ సపోర్ట్ తో..
ఒక హీరో కెరీర్ లో హిట్ సినిమా ఎంత ముఖ్యమో.. కష్టకాలంలో అండగా నిలిచే వ్యక్తి అంతే ముఖ్యమని మరోసారి నిరూపించారు యంగ్ హీరో అక్కినేని అఖిల్.
ఒక హీరో కెరీర్ లో హిట్ సినిమా ఎంత ముఖ్యమో.. కష్టకాలంలో అండగా నిలిచే వ్యక్తి అంతే ముఖ్యమని మరోసారి నిరూపించారు యంగ్ హీరో అక్కినేని అఖిల్. ఏజెంట్ వంటి నిరాశ తర్వాత సరైన విజయాన్ని అందుకోవడానికి చాలా కాలం ఎదురుచూసిన అఖిల్ కు ఇప్పుడు లెనిన్ రూపంలో కమర్షియల్ బ్రేక్ దక్కింది. అయితే ఆ విజయానికి కారణమైన వారిలో తన వైఫ్ జైనబ్ రవ్జీ కూడా ఒకరని అఖిల్ స్వయంగా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల విడుదలైన లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా సక్సెస్ మీట్ ను గుంటూరులో గ్రాండ్ గా నిర్వహించగా, ఆ ఈవెంట్ లో అఖిల్ తో పాటు ఆయన భార్య జైనబ్ కూడా పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఆ జంట మొదటిసారిగా ఒక పబ్లిక్ ఈవెంట్ లో కలిసి కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సక్సెస్ మీట్ లో మాట్లాడిన అఖిల్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'నా భార్య జైనబ్ నా లక్. ఆమెను నేను ‘బంగారు తల్లి అని పిలుస్తాను. గత మూడేళ్లుగా నా కఠిన పరిస్థితుల్లో ఆమె నాకు అండగా నిలిచింది. ఎప్పుడూ నన్ను ప్రోత్సహించింది. బలంగా నిలబెట్టింది' అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. అఖిల్ చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సినీ ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాపులు సహజం. అయితే పెద్ద ప్లాప్ తర్వాత మళ్లీ స్ట్రాంగ్ గా నిలబడటం అంత ఈజీ కాదు.
ఏజెంట్ తర్వాత అఖిల్ కెరీర్ పై అనేక ప్రశ్నలు వచ్చాయి. ఆ సమయంలో కుటుంబం, సన్నిహితుల సపోర్ట్ ఆయనకు ఎంతో అవసరమైంది. ఇప్పుడు లెనిన్ విజయంతో అఖిల్ మళ్లీ తన ప్లేస్ కోసం స్ట్రాంగ్ గా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో జైనబ్ రవ్జీ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీకి చెందిన ఆమె ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే పెళ్లి తర్వాత ఎక్కువగా మీడియాకు దూరంగానే ఉన్నారు. అందుకే గుంటూరు సక్సెస్ మీట్ కు ఆమె హాజరు కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఆ ఈవెంట్ లో అఖిల్- జైనబ్ మధ్య కనిపించిన బాండింగ్ కూడా ఆకట్టుకుంది. అభిమానులు, నెటిజన్లు ఆ జంటను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఆనందం, మరోవైపు అఖిల్ కెరీర్ లో సక్సెస్ కలిసి వచ్చిందని చెప్పాలి.
ఏదేమైనా లెనిన్ అఖిల్ కు ఓన్లీ కమర్షియల్ హిట్ సినిమానే కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగేందుకు దొరికిన టర్నింగ్ పాయింట్ గా కూడా కనిపిస్తోంది. ఆ జర్నీలో బంగారు తల్లిగా పిలిచే జైనబ్ ఇచ్చిన సపోర్ట్ గురించి అఖిల్ చెప్పడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఆ జంట టాలీవుడ్ లో మోస్ట్ టాకింగ్ కపుల్ గా మారగా, అఖిల్ కెరీర్ కూడా కొత్త జోష్ తో ముందుకు సాగుతోంది.