అఖిల్ 'లెనిన్'.. 3 రోజుల్లో ఎంత రాబట్టిందంటే?

ఆ కలెక్షన్లలో మరో ఆసక్తికరమైన అంశం కూడా కనిపిస్తోంది. సాధారణంగా తొలి రోజు లేదా రెండో రోజు ఎక్కువ వసూళ్లు నమోదవుతుంటాయి.

Update: 2026-07-13 08:17 GMT

అక్కినేని అఖిల్ కెరీర్‌ లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ విజయం లెనిన్ రూపంలో దక్కినట్లు కనిపిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఆ మూవీ.. మొదటి వీకెండ్ ముగిసే సమయానికి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసింది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అఖిల్ కెరీర్‌ లో ఇదే అత్యంత భారీ వీకెండ్ కలెక్షన్లుగా తెలుస్తోంది.

 

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ పీరియాడిక్ రూరల్ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని ప్రాంతాల్లో రెస్పాన్స్ పెరిగింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఆ మూవీ.. రెండు రోజుల్లో రూ.37.2 కోట్లకు చేరుకుంది. ఆదివారం మరింత జోరు చూపిన సినిమా.. మూడు రోజులు పూర్తయ్యే సమయానికి రూ.61.1 కోట్ల గ్రాస్ మార్క్‌ అందుకుంది.

ఆ కలెక్షన్లలో మరో ఆసక్తికరమైన అంశం కూడా కనిపిస్తోంది. సాధారణంగా తొలి రోజు లేదా రెండో రోజు ఎక్కువ వసూళ్లు నమోదవుతుంటాయి. అయితే లెనిన్ విషయంలో మూడో రోజు కలెక్షన్లు మరింత పెరగడం అందరి దృష్టిని ఆకర్షించింది. టికెట్ ధరల పెంపు లేకుండానే ఆదివారం భారీ వసూళ్లు రావడం సినిమాకు ప్రేక్షకుల నుంచి స్ట్రాంగ్ మౌత్ టాక్ లభిస్తోందని అర్థమవుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడం సినిమాకు బలంగా మారినట్లు టాక్ వినిపిస్తోంది.

వసూళ్లను నిర్మాత నాగవంశీ కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ లో "మనోడు బ్లాక్‌ బస్టర్ కొట్టేశాడు" అంటూ ఆనందం వ్యక్తం చేశారు. సినిమా కోసం ఏడాదిన్నర పాటు చేసిన ప్రయాణం ఫలించిందని పేర్కొంటూ ఎమోషనల్ నోట్ ను పంచుకున్నారు. తొలి వీకెండ్ లోనే డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులు తిరిగి రాబట్టడం, ఎగ్జిబిటర్లు హౌస్‌ ఫుల్ షోస్ తో సంతోషంగా ఉండటం తమకు నిజమైన విజయమని తెలిపారు.

అయితే అఖిల్ నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో ఆయన యాక్టింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన పాత్రలో న్యాచురల్ గా నటించగా.. అఖిల్‌ తో ఆమె ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంతో సాగిన కథలో ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడం మరో బలంగా మారింది.

సినిమాను అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందించిన ఆ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే మొదటి వీకెండ్ లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన లెనిన్ కు ఇప్పుడు అసలు పరీక్ష సోమవారం నుంచి ఉండనుంది. ఇదే స్థాయిలో ప్రేక్షకుల రెస్పాన్స్ కొనసాగితే.. త్వరలోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌ లో చేరే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News