దసరాకి ఫ్యాన్స్ కి డబుల్ ఫెస్ట్..?

అఖండ 2, ఓజీ రెండు సినిమాలు దసరాకి వస్తే తప్పకుండా ఆడియన్స్ కి పండగ రోజు డబుల్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.;

Update: 2025-07-02 15:11 GMT

ఫెస్టివల్ టైంలో ఆ జోష్ ని మరింత పెంచేందుకు సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. సంక్రాంతి తర్వాత దసరా ఫెస్టివల్ కి ఎక్కువ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తారు. దసరాకి ఎక్కువ రోజులు హాలీడేస్ ఉండటం వల్ల ఆ టైంకు సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేస్తారు. ఎప్పటిలానే ఈ దసరాకి కూడా స్టార్ సినిమాలు రాబోతున్నాయి. వాటిలో నందమూరి నట సింహం బాలకృష్ణ అఖండ 2 వస్తుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ ని కూడా దసరాకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 భారీగా రాబోతుంది. బోయపాటి ఈ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని అలరించే కంటెంట్ తో ఈ సినిమా తెస్తున్నారు. సినిమాలో సంయుక్త మీనన్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. దసరా బరిలో సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ లాక్ చేశారు.

ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీని కూడా దసరాకి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అఖండ 2, ఓజీ రెండు సినిమాలు దసరాకి వస్తే తప్పకుండా ఆడియన్స్ కి పండగ రోజు డబుల్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఐతే ఈ రెండు సినిమాలకు కామన్ థింగ్ ఏంటంటే రెండిటికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అఖండ 2 తో మరోసారి మ్యూజిక్ తో తాండవం చేయాలని చూస్తున్న థమన్.. ఓజీతో తనలోని డిఫరెంట్ యాంగిల్ ని చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

ఐతే ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉన్నా రెండు వేరు వేరు జోనర్ సినిమాలు కాబట్టి తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పొచ్చు. అఖండ 2 నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేయగా ఓజీ ఫస్ట్ గ్లింప్స్ తోనే కేక పెట్టించారు. సో ఈ దసరాకి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓజీతో.. నందమూరి ఫ్యాన్స్ అఖండ 2 తో ఫెస్టివల్ జోష్ ని మరింత పెంచుకోనున్నారు.

Tags:    

Similar News