బోయపాటి తెలివైన ఆట!
అక్కడ బ్యాక్ డ్రాప్ లో వచ్చేవి అన్ని అఘోర సన్నివేశాలు..హిందుత్వానికి సంబంధించిన కథనే నడుపుతున్నారు.;
మాస్ సంచలనం బోయపాటి శ్రీను పాన్ ఇండియాలో `స్కంద` రిలీజ్ చేయాలనుకున్నారు? కానీ చివరి నిమిషంలో కంటెంట్ పై డౌట్ రావడంతో రీజనల్ మార్కెట్ కే పరిమితం చేసారు. బోయపాటి మార్క్ ఎలివేషన్ పుష్కలంగా ఉన్నా? కంటెంట్ యూనివర్శల్ గా కనెక్ట్ అవుతుందా? లేదా? అన్న సందేహం రావడంతో రిస్క్ తీసుకోలేదు. తాజా ప్రాజెక్ట్ విషయంలో మాత్రం అలాంటి తప్పిదం జరగకుండా పక్కా ప్లాన్ తోనే దిగుతున్నారు. `అఖండ`కు నార్త్ లో వచ్చిన అనూహ్యమైన క్రేజ్ చేసి `అఖండ2` విషయంలో తాను తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
అఘోర పాత్ర..కుంభమేళ ప్రత్యేకత:
ఈ సారి పాన్ ఇండియాలో ఎలాంటి డౌట్ లేకుండా పక్కాగా రిలీజ్ కు రెడీ అవుతున్నారు. అటు నార్త్ ఆడియన్స్ ను డివైన్ తో లాక్ చేస్తూ..ఇటు సౌత్ కం తెలుగు ఆడియన్స్ ను తన మార్క్ మాస్ కంటెంట్ తో లాక్ చేస్తున్నారు. రెండు రకాల పాత్రలను పక్కాగా డిజైన్ చేసుకుని ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు బోయపాటి. ఈ విషయంలో బోయపాటి ఎక్కడ తడబడ లేదు. అఘోర పాత్రను తెలివిగా నార్త్ కి కనెక్ట్ చేస్తున్నారు. అందుకే కుంభమేళాలో చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. ఉత్తరాదిలో కాశీ నగరంలోనే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు.
బాలయ్య సెకెండ్ రోల్ బ్లాస్టే:
అక్కడ బ్యాక్ డ్రాప్ లో వచ్చేవి అన్ని అఘోర సన్నివేశాలు..హిందుత్వానికి సంబంధించిన కథనే నడుపుతున్నారు.
అహ్మదాబాద్ లో కూడా మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఉండే దేవాలయాలను కూడా షూట్ లో భాగంగా కవర్ చేసారు. ప్రత్యేకించి బాలయ్య అఘోర అవతారానికి సంబంధించి అవసరం మేర చిన్నపాటి సెట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమాలో బాలయ్య సెకెండ్ లీడ్ ఎలా ఉంటుంది? అన్నది బ్లాస్టింగ్ రోర్ టీజర్ తో అర్దమైంది.
రెండు పాత్రలతో అటు..ఇటూ:
ఇది సౌత్ కి కనెక్ట్ అయ్యే రోల్ . ప్రత్యేకించి తెలుగులో బాలయ్య అభిమానులకు ఊపు తెచ్చే పాత్ర ఇదిని క్లారిటీ వచ్చేసింది. బాలయ్య లో మాస్ ఇమేజ్ ని ఎక్కడా తగ్గించకుండా పక్కాగా ఈ పాత్రను డిజైన్ చేసారు. తెలుగు ఆడియన్స్ కు..నందమూరి అభిమానులకు ఈ రోల్ ఈజీగా కనెక్ట్ అవుతుంది. పవర్ పుల్ పంచ్ డైలాగ్లు..బాలయ్య మార్క్ మ్యానరిజమ్ అంతా ఈ పాత్రలో హైలైట్ అవుతుంది. మధ్యలో అఘోర పాత్ర కొత్త అనుభూతిని పంచు తుంటుంది. ఈ రెండు పాత్రలను బోయపాటి తెలివిగా రాసి నార్త్-సౌత్ కనెక్ట్ చేసే ప్రయత్నం అన్నది ప్రశం సనీయం.