అఖండతో వైజయంతి... నిజమైతే ఫుల్‌ కిక్‌

అఖండ 2 సినిమాలో రియల్‌ కుంభమేళ విజువల్స్‌ను అద్భుతంగా దర్శకుడు బోయపాటి శ్రీను చూపించబోతున్న విషయం తెల్సిందే.;

Update: 2025-05-21 04:28 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీరి కాంబోలో డబుల్‌ హ్యాట్రిక్ కొట్టడం కోసం రాబోతున్న సినిమా 'అఖండ 2'. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇదే ఏడాది దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నారు. దసరాకు విడుదల సాధ్యం కాకుంటే వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీ విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అఖండ 2 సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అఖండ 2 సినిమాలో రియల్‌ కుంభమేళ విజువల్స్‌ను అద్భుతంగా దర్శకుడు బోయపాటి శ్రీను చూపించబోతున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా హిమాలయాల్లో అద్భుతమైన మంచు కొండల్లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని వార్తలు వచ్చాయి. బాలయ్య అఘోర పాత్రకు సంబంధించిన విజువల్స్‌ విజువల్ వండర్‌ అన్నట్లుగా ఉంటాయని మేకర్స్ చాలా బలంగా చెబుతున్నారు. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో అఖండ 2 సినిమాలో లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి కీలకమైన పాత్రలో కనిపించబోతుందని, ఆమె చేసే పాత్ర సినిమా కథకు ఆయువుపట్టు వంటిది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో విజయశాంతి వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి సన్నాఫ్‌ వైజయంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో విజయశాంతి నటనకు మరోసారి అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు ఫిదా అయ్యారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పార్ట్‌ టైం సినిమాలకు సమయం కేటాయించాలని విజయశాంతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే విజయశాంతి అఖండ 2 సినిమాలోనూ నటించేందుకు ఓకే చెప్పిందేమో అనే టాక్‌ వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఈ విషయమై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.

అఖండ 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయశాంతి వంటి క్రేజీ లేడీ సూపర్‌ స్టార్‌ నటించడం వల్ల కచ్చితంగా సినిమాకు హైప్‌ భారీగా క్రియేట్‌ అవుతుంది. సినిమాకు హైప్‌ క్రియేట్‌ చేయడం కోసం, సినిమా మార్కెట్‌ను పెంచడం కోసం కచ్చితంగా విజయశాంతిని సినిమాలో నటింపజేయాలని బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో క్రేజీ కాంబోల కారణంగా భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. కనుక అఖండ 2 లో బాలకృష్ణతో పాటు విజయశాంతి నటిస్తే కచ్చితంగా మరో లెవల్‌ అన్నట్లుగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు అఖండ 2 లో విజయశాంతి ఉంటే ఫుల్‌ కిక్ ఖాయం. మరి ఆ కిక్‌ లభించేనా చూడాలి.

Tags:    

Similar News