సంక్రాంతికి అఖండ 2..?
కానీ ఇప్పుడు ఆ సినిమాను 2026 సంక్రాంతి రేసులో దించేలా ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తే రికార్డులు సృష్టిస్తుంది.;
అఖండ సూపర్ హిట్ అవ్వడంతో బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి అఖండ 2 తాండవం మొదలు పెట్టారు. మరో కొత్త కథ చేయడం కన్నా ఆడియన్స్ కి బాగా ఎక్కిన అఖండ కథనే ఆ పాత్రలనే మరో కథలో కొనసాగిస్తే బాగుంటుందని ఈ ఇద్దరు అలా ఈ సినిమా ఫిక్స్ చేశారు. ఐతే అఖండ 2 సినిమా ఆడియన్స్ అంచనాలను మించి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి అఖండ 2 మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారట.
అఖండ తెలుగు సినిమానే అయినా ఆ సినిమా ఇంపాక్ట్ పాన్ ఇండియా వైడ్ వినిపించింది. అందుకే ఈసారి అఖండ 2 ని డైరెక్ట్ గా నేషనల్ లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. అంతేకాదు ఏదో సరదాగా పాన్ ఇండియా రిలీజ్ అన్నట్టు కాకుండా కథ అందరికీ వర్తించేలా రాసుకున్నారట. బోయపాటి శ్రీను ఈ సినిమాతో నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని రీచ్ అవుతాడని అంటున్నారు.
ఐతే అఖండ 2 ని అసలైతే ఈ ఇయర్ దసరాకి రిలీజ్ అని అనుకున్నారు. బాలయ్య సినిమాలు అనుకున్న విధంగా తెరకెక్కించడం రిలీజ్ లు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో జరుగుతాయి. ఐతే అఖండ 2 మాత్రం కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నారని తెలుస్తుంది. బాలకృష్ణ ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని టాక్. పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ కి రీచ్ అయ్యింది అంటే అఖండ 2 అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా చూస్తున్నారట.
అఖండ 2 దసరా మిస్ అయితే డిసెంబర్ వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమాను 2026 సంక్రాంతి రేసులో దించేలా ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తే రికార్డులు సృష్టిస్తుంది. సంక్రాంతి సెంటిమెంట్ బాలకృష్ణకు ఎప్పుడు కలిసి వస్తూనే ఉంది. అఖండ 2 కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యి 2026 పొంగల్ రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. అఖండ 2 తర్వాత మరోసారి బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
వీర సింహా రెడ్డి తర్వాత బాలయ్యతో గోపీచంద్ చేస్తున్న సినిమా అవ్వడంతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ మీద కూడా నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. అంతేకాదు ఈమధ్యనే సన్నీ డియోల్ తో జాత్ సినిమా చేసి హిట్ అందుకున్న గోపీచంద్ బాలకృష్ణతో కూడా పాన్ ఇండియా బొమ్మ చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.