రేసింగ్ స్టార్ అజిత్‌తో డ్యాన్సింగ్ స్టార్ శ్రీ‌లీల‌

త‌ళా అజిత్ కుమార్ ఏం చేసినా అది చాలా క్రేజీగా ఉంటుంది. అత‌డి సింప్లిసిటీ.. న‌టుడిగా ఉన్న ఫాలోయింగ్... రేస‌ర్‌గా గ‌ట్స్ ప్ర‌తిదీ క్రేజీ క్రేజీ. అజిత్ 50 ప్ల‌స్ వ‌య‌సులోను అదే దూకుడును కొన‌సాగిస్తున్నాడు.;

Update: 2025-12-13 11:28 GMT

త‌ళా అజిత్ కుమార్ ఏం చేసినా అది చాలా క్రేజీగా ఉంటుంది. అత‌డి సింప్లిసిటీ.. న‌టుడిగా ఉన్న ఫాలోయింగ్... రేస‌ర్‌గా గ‌ట్స్ ప్ర‌తిదీ క్రేజీ క్రేజీ. అజిత్ 50 ప్ల‌స్ వ‌య‌సులోను అదే దూకుడును కొన‌సాగిస్తున్నాడు. అత‌డు ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే, ఫార్ములా వ‌న్ రేస‌ర్ గా రాణిస్తున్నాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌ల త‌ర‌బ‌డి కొన‌సాగుతున్న రేసింగ్ స‌ర్క్యూట్ లో అత‌డి పేరు మార్మోగిపోతోంది. ఒక సినిమా స్టార్ ఇలా రేస‌ర్ గా భిన్న‌మైన ఆస‌క్తిని క‌లిగి ఉండ‌టం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌గా మారుతోంది. అయితే రేసింగ్ ప్రొఫెష‌న్‌లో ప్ర‌మాదాలు కూడా అత‌డిని భ‌య‌పెట్ట‌క‌పోవ‌డం అభిమానుల‌ను ప్ర‌తిసారీ టెన్ష‌న్ కి గురి చేస్తోంది.

అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ మాస్ ఫాలోయింగ్ ఉంద‌న‌డంలో సందేహం లేదు. అంతేకాదు ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ స్టార్లు కూడా అత‌డికి అభిమానులు. ప్రస్తుతం భారతీయ సినిమాలో అత్యంత డిమాండ్ ఉన్న యువ నటీమణులలో ఒకరైన శ్రీలీల త‌ళా అజిత్ కి అభిమాని. అంతేకాదు అత‌డి స‌ర‌స‌న క‌థానాయికగా అవ‌కాశం అందుకుంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న AK64 చిత్రంలో తెలుగ‌మ్మాయి శ్రీ‌లీల‌ కీలక పాత్ర పోషిస్తుందని గట్టిగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రీ‌లీల ఇప్పుడు మలేషియా రేసింగ్ సర్క్యూట్‌లో కనిపించింది. అక్క‌డ త‌ళా అజిత్ తో ఫ్యాన్ గ‌ర్ల్ మూవ్ మెంట్ ని ఆస్వాధించింది. అజిత్‌తో కలిసి శ్రీలీల సెల్ఫీ దిగుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. రేస్ ట్రాక్ పై శ్రీ‌లీల, అజిత్ గాగుల్స్ ధ‌రించి స్టైలిష్ గా క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్‌ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

మ‌లేషియాలో ఈ ఊహించని భేటీ అజిత్ కుమార్ అభిమానులలో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. త‌ళా అజిత్- శ్రీ‌లీల రేర్ కాంబినేష‌న్ లో సినిమాని వీక్షించాల‌ని చాలా మంది ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. ఏకే 64లో శ్రీ‌లీల పాత్ర ఎలా ఉండ‌బోతోందో తెలుసుకోవాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే శ్రీలీల ఈ చిత్రంలో భాగమైనా కానీ అజిత్ స‌రసన కథానాయికగా నటించే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అజిత్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సినిమాలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్‌లాల్ కూడా ఒక కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అజిత్-మోహ‌న్ లాల్- శ్రీ‌నిధి- శ్రీ‌లీల రేర్ కాంబినేషన్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది. అయితే చిత్ర బృందం నటీనటుల గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.

AK64 నిజానికి ఈపాటికే ప్రారంభం కావాల్సి ఉన్నా అజిత్ ఫార్ములా వ‌న్ రేసింగ్ షెడ్యూల్ కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతోంది. అజిత్ తన రేసింగ్ ఈవెంట్‌లను పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరి 2026 నుండి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.




Tags:    

Similar News