ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో ఆదిత్య ధర్ నెక్ట్స్ మూవీ?
బాలీవుడ్‌లో ఇటీవల యాక్షన్ సినిమాలకు కొత్త ఊపు తీసుకొచ్చిన డైరెక్టర్ ఆదిత్యధర పేరు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బాలీవుడ్‌లో ఇటీవల యాక్షన్ సినిమాలకు కొత్త ఊపు తీసుకొచ్చిన డైరెక్టర్ ఆదిత్యధర పేరు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ధురంధర్2 డైరెక్టర్ నెక్ట్స్ సినిమా స్టోరీ రెడీ అయిందని, ఆ సినిమాలో ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించనున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టులు ఇప్పుడు సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ చూసిన వెంటనే చాలా మంది అభిమానులు ఆ హీరో మరెవరో కాదు ప్రభాస్ అని గెస్ చేస్తున్నారు. దీంతో ఆదిత్య ధర్- ప్రభాస్ కాంబినేషన్‌పై ఊహాగానాలు ఒక్కసారిగా పీక్‌కు చేరాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారడంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది.
ఇప్పటికే భారీ స్కేల్ యాక్షన్ సినిమాలను స్టైలిష్‌గా తెరకెక్కించే డైరెక్టర్ గా ఆదిత్య ధర్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దేశభక్తి, ఇంటెన్స్ యాక్షన్, హై వోల్టేజ్ ఎమోషన్స్‌ను కలిపి మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే టాలెంట్ ఆయనకు ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌లో అత్యంత భారీ క్రేజ్ ఉన్న స్టార్‌లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన లైనప్‌లో ఇప్పటికే ఫౌజీ, స్పిరిట్, కల్కి సీక్వెల్ ప్రాజెక్టులున్నాయి. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటంతో ప్రభాస్ డేట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యంత విలువైనవిగా మారాయి. అలాంటి సమయంలో ఆదిత్య ధర్ కథను ప్రభాస్ వింటారా? ఒకవేళ కథ నచ్చితే వెంటనే ఓకే చెబుతారా? అన్న చర్చలు సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.
ప్రత్యేకంగా అభిమానులను ఆకట్టుకుంటున్న అంశం ఏంటంటే, ఆదిత్య ధర్ స్టైల్‌కు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. భారీ యాక్షన్ సెటప్స్, ఎమోషనల్ హై పాయింట్స్, దేశవ్యాప్తంగా కనెక్ట్ అయ్యే కథలు తెరకెక్కించడంలో ఆదిత్య ధర్‌కు మంచి పట్టు ఉంది. అదే సమయంలో ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్, నార్త్ మార్కెట్‌లోని క్రేజ్ ఈ కాంబినేషన్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆదిత్యధర్ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ చేసిన కథ కూడా ధురంధర్ రేంజ్ స్టోరీ అనే మాట ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్ నిజంగా సెట్స్‌పైకి వస్తే అది దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అయితే వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ కాంబినేషన్ వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ పూర్తి చేయడానికి కనీసం వచ్చే రెండేళ్లు బిజీగా ఉండే అవకాశముంది. మరోవైపు ఆదిత్య ధర్ కూడా తన ప్రస్తుత ప్రాజెక్టుల పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. అందువల్ల ఈ కాంబినేషన్ నిజమవ్వాలంటే మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ అధికారిక ప్రకటన రాకముందే ఈ స్థాయి హైప్ రావడం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నిజంగా ప్రభాసేనా? అని అందరూ ఎదురుచూస్తున్నారు.