ఆ డైరెక్టర్‌ ను అప్రోచ్ అయిందెవరు? మనవాళ్లంతా బిజీ కదా!

అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఆదిత్య ధర్ చూపులు ఇప్పుడు టాలీవుడ్ వైపు కూడా మళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2026-06-18 14:30 GMT

ధురంధర్ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారారు. వరుస విజయాలతో తన మార్కెట్‌ ను ఫుల్ గా పెంచుకున్న ఆ దర్శకుడితో సినిమా చేయాలని బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ధురంధర్ సిరీస్ తర్వాత ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో ఉంటుందనే చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఉరి సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ తో ప్రూవ్ చేసుకున్న ఆదిత్య ధర్, ఆ తర్వాత ధురంధర్ సిరీస్‌ తో హైరేంజ్ కు చేరుకున్నారు. భారీ గ్రాఫిక్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ పై ఆధార పడకుండా.. స్ట్రాంగ్ స్టోరీ, స్పై డ్రామా, యాక్షన్ ఎలిమెంట్స్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దీంతో ఆయన పేరు పాన్ ఇండియా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయింది.

ప్రస్తుతం ఆదిత్య ధర్ తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. బీటౌన్ వార్తల ప్రకారం, ఆయన ఇప్పటికే కొత్త కథను సిద్ధం చేశారు. ఆ ప్రాజెక్ట్ 2027 మార్చిలో సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి హీరో రణవీర్ సింగ్‌ తో ఆయన వర్క్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో హ్యాట్రిక్ కాంబోపై అంచనాలు పెరుగుతున్నాయి.

అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఆదిత్య ధర్ చూపులు ఇప్పుడు టాలీవుడ్ వైపు కూడా మళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఆయనతో కలిసి పనిచేయాలనే ఆసక్తితో తనకు తెలిసిన వారితో ద్వారా సంప్రదింపులు జరిపినట్లు చర్చ నడుస్తోంది. అయితే ఆ హీరో ఎవరు అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లోని దాదాపు అందరు స్టార్ హీరోలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరి లైనప్‌ లో ఇప్పటికే రెండు నుంచి మూడు భారీ సినిమాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధర్‌ తో సినిమా చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే విషయం ఆసక్తిని పెంచుతోంది.

మరోవైపు ప్రభాస్‌తో ఆదిత్య ధర్ ఓ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే టాలీవుడ్‌ లో మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ పై కూడా కొన్ని రూమర్లు వినిపిస్తున్నా, అవి ఇప్పటివరకు రూమర్లకే పరిమితమయ్యాయి. ఏదేమైనా ఒక విషయం మాత్రం క్లియర్ కనిపిస్తోంది.

ప్రస్తుతం ఆదిత్య ధర్‌తో సినిమా చేయడానికి హీరోలు, నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మాత్రం మార్కెట్‌ ను కాకుండా కథను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. కథకు సరిపోయే హీరోనే ఎంపిక చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ధర్ నెక్స్ట్ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఆ చర్చలకు తెరపడేలా కనిపించడం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎవరు ముందుగా ఆయనతో చేతులు కలుపుతారన్నది చూడాలి మరి.

Tags:    

Similar News