• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిల్లల వల్ల సుస్మితా...

పిల్లల వల్ల సుస్మితా కెరీర్ నాశనం అయిందా?

| రెనా నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. రెనా ను నేను దత్తత తీసుకున్న సమయంలో తన ఆరోగ్యం సరిగా లేదు

By - Tupaki Desk
Update: 2023-08-30 10:26 GMT

విశ్వసుందరిగా ఎంతో మంది అభిమానం ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ సుస్మితా సేన్ ఒకానొక సమయంలో బాలీవుడ్ టాప్ స్టార్‌ హీరోయిన్‌ గా వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు పోయింది. కానీ అనూహ్యంగా చిన్న వయసు లోనే సుస్మితా సినిమా ఇండస్ట్రీ నుండి సైడ్ అయింది. ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకున్నా కూడా పిల్లలకు తల్లి అయింది.

దత్తత తీసుకోవడం వల్ల తల్లి అయిన సుస్మితా ఆ పిల్లల వల్లే తన సినీ కెరీర్ దెబ్బ తిన్నది అన్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్‌ గా చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె నటించిన 'తాలీ' అనే వెబ్‌ సిరీస్ ఇటీవలే స్ట్రీమింగ్‌ అయింది. జియో టీవీ లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్ లో ట్రాన్స్ జెండర్ గా నటించిన విషయం తెల్సిందే.

సిరీస్‌ ప్రకటన వచ్చిన వెంటనే చాలా మంది షాక్ అయ్యారు. సుస్మితా సేన్‌ ట్రాన్స్ జెండర్ గా నటించడం ఏంటి, అంత అవసరం ఏంటి అంటూ విమర్శలు గుప్పించారు. అలాంటి వారందరికి కూడా తన నటనతో సమాధానం ఇచ్చింది. నటి అన్నప్పుడు అన్ని రకాల పాత్రలు చేయాలి. అందుకే తాను ఆ పాత్రను చేశాను అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇక కెరీర్ విషయానికి వస్తే 24 ఏళ్ల వయసు లో ఒక బిడ్డను దత్తత తీసుకున్నాను. ఆ పాపను నేను కనకున్నా కూడా అంతకు మించి ఆ పాపకి నా ప్రేమను అందించాను. నేను దత్తత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన సమయంలో నా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు చాలా మంది వద్దని వారించారు, కెరీర్‌ పరంగా ఇబ్బందులు ఉంటాయని హెచ్చరించారు. అయినా నేను ఎవరి మాట వినలేదు.

రెనా నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. రెనా ను నేను దత్తత తీసుకున్న సమయంలో తన ఆరోగ్యం సరిగా లేదు. అప్పుడే నేను ఒక సినిమా షూటింగ్ కోసం కెనడా కి వెళ్లాల్సి వచ్చింది. ప్రముఖ హీరో సినిమా షూటింగ్‌ అవ్వడం వల్ల రెనా ను వదలి వెళ్లాను. అక్కడకు వెళ్లిన తర్వాత పాప ఆరోగ్యం అస్సలు బాగాలేదని నాన్న ఫోన్ చేశాను.

పాపను అస్సలు వదిలి కెనడా వెళ్లడం ఇష్టం లేని నేను పాప ఆరోగ్యం సరిగా లేదు అనగానే వెంటనే షూటింగ్ లో అందరికి చెప్పేసి అర్థాంతరంగా అక్కడ నుండి వచ్చేశాను. ఆ సమయంలోనే నాకు ఇకపై నా సినీ కెరీర్‌ సజావుగా సాగదు అని అర్థం అయింది.

ఒక పాప తర్వాత మరో పాపను దత్తత తీసుకోవడం వల్లే ఆ సమయంలో సుస్మిత సేన్ సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. ఇప్పుడు పిల్లలు పెద్ద వారు అవ్వడం వల్లే వరుసగా సిరీస్ ల్లో నటిస్తున్నట్లుగా ఆమె సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట.

Tags:    
  • Sushmitasen 
  • Sushmitasendaughter 
  • Reneesen 
  • Filmindustry 
  • Reneehealth 
  • Actresssushmita 
  • Thaliwebseries 
  • Movieshooting 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS