ప్రముఖ తెలుగు నటి బ్రేకప్- మెంటల్ ట్రామా.. అసలు నిజమిదే!
ఒక బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్‌లో తన అద్భుత నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రముఖ తెలుగు నటి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.
ఒక బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్‌లో తన అద్భుత నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రముఖ తెలుగు నటి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సిరీస్‌లో ఒక పాపులర్ హిందీ నటుడితో ఈ బ్యూటీ చేసిన బోల్డ్, రొమాంటిక్ సీన్స్ వల్లే తనను బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడని, దానివల్ల తీవ్ర మానసిక క్షోభకు గురై ఆసుపత్రి పాలైందనే కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు ఫోటోగ్రాఫర్ల ఇన్ స్టా పేజీలు, ఫ్యాన్స్ పేజీలలో ఈ మేరకు వీడియోలు షేర్ చేయటంతో ఇది బయటపడింది. అయితే ఈ ప్రచారం నిజమా? అన్నది ఆరా తీస్తే ఇందులో అస్సలు నిజం లేదు. ఇది కేవలం సదరు నటి పాత ఇంటర్వ్యూను తప్పుగా ఎడిట్ చేసి సృష్టించిన అబద్ధపు ప్రచారం మాత్రమే.
నిజానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్.. సదరు తెలుగు నటి 2021లో దైనిక్ భాస్కర్ పత్రికకు ఇచ్చిన పూర్తి స్థాయి ఇంటర్వ్యూ నుంచి తీసుకున్నది. ఆ లాంగ్-ఫార్మాట్ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఎదుగుదల, పరిశ్రమలో గాడ్‌ఫాదర్ లేకుండా సాధించిన విజయం గురించి మాట్లాడారు. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన టాక్సిక్ అండ్ అబ్యూసివ్ రిలేషన్‌షిప్ (హింసాత్మక బంధం), దానివల్ల అనుభవించిన నరకం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాత మాటలనే ఇప్పుడు కొందరు బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సీన్స్‌కు ముడిపెడుతూ తప్పుడు నెరేటివ్‌తో ప్రచారం చేస్తున్నారు.
అసలు నిజానికి ఆ ప్రముఖ తెలుగు నటి మానసికంగా, శారీరకంగా కుంగిపోవడానికి తను చేసిన `బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్`లోని నటనకు ఎలాంటి సంబంధం లేదు. తను కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమయంలో..వ్యక్తిగత జీవితంలో ఒక చెడు భాగస్వామి వల్ల నరకం అనుభవించానని చెప్పారు. ఆ బంధం వల్ల ఏర్పడిన మానసిక ఒత్తిడి కారణంగానే అనారోగ్యం పాలయ్యారు తప్ప, తెరమీద హద్దు మీరి రొమాన్స్ చేయడం వల్ల కాదనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.
``నేను ఆ సిరీస్ షూటింగ్స్‌లో బిజీగా ఉన్న సమయంలో నా వ్యక్తిగత జీవితం ఒక పెద్ద అగాధంలో పడిపోయింది. ఆ ఒత్తిడి భరించలేక నేను చాలాసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మానసికంగా ఎంతగా క్షీణించానంటే ఎవరినీ కలవలేకపోయేదాన్ని, మాట్లాడలేకపోయేదాన్ని. నా స్నేహితులు ఫోన్ చేసినా నేను కేవలం ఏడవడం మాత్రమే వినేవారు. నా తండ్రి కూడా నాతో మాట్లాడటం మానేశారు. ఆ భయంకరమైన రిలేషన్‌షిప్ వల్ల నన్ను నేను ఒంటరిని చేసుకున్నాను!`` అని ఈ నటి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన స్నేహితుడు అజాన్ ఇచ్చిన భరోసాతోనే తాను ఆ టాక్సిక్ బంధం నుంచి బయటపడి మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టగలిగానని స్పష్టం చేశారు. దీన్నిబట్టి సోషల్ మీడియాలో వస్తున్న బ్రేకప్ వార్తలు కేవలం క్లిక్ బైట్ కోసమేనని.. ఆ వెబ్ సిరీస్ సీన్స్‌కు దీనికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమైంది. నిఖిల్ సరసన డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్నేళ్ల పాటు తెలుగు, తమిళం సినిమాలు చేసినా రాని బ్రేక్ ఆ పేమస్ వెబ్ సిరీస్ వల్ల దక్కింది.