• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంబానీల నుండి అమీర్...

అంబానీల నుండి అమీర్ డ‌బ్బు తీసుకునే..!

| వాస్తవానికి ఈ ప్రీ వెడ్డింగ్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో కలిసి తన స్టేజ్ పెర్ఫామెన్స్ కోసం మెగాస్టార్ అమీర్ ఖాన్ ఒక్క పైసా కూడా వసూలు చేయలేదని తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-03-08 04:31 GMT

అమీర్ ఖాన్ సాధారణంగా ప్రైవేట్ వివాహాలలో పాల్గొనడు. గుజ‌రాత్- జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలలో అతడు అలా చేశాడు. అయితే ఈ ప్రత్యేక ప్రదర్శన కోసం అంబానీల నుండి అమీర్ ఎంత వసూలు చేశాడు? అంబానీల ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో SRK, సల్మాన్‌తో కలిసి వేదిక‌పై ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు అమీర్ ఖాన్ నమ్మశక్యం కాని రుసుము వసూలు చేశాడనేది ఒక ప్ర‌చారం. అయితే ఇది నిజ‌మా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లను ఒకే వేదికపైకి తీసుకురావడం ఆచరణాత్మకంగా అసాధ్యం. కానీ జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం అంబానీలు అలా చేయగలిగారు. ఇప్పుడు అమీర్‌ఖాన్‌ స్పెషల్‌ పెర్‌ఫార్మెన్స్‌కి ఎంత రుసుము తీసుకున్నారనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

త‌న పెర్ఫామెన్స్ కు అమీర్ ఖాన్ ఎంత వసూలు చేసాడు? అంటే..ఈ ప్రత్యేక ప్రదర్శన కోసం అమీర్ ఖాన్ డ‌బ్బు వసూలు చేసాడ‌నే వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదు. వాస్తవానికి ఈ ప్రీ వెడ్డింగ్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో కలిసి తన స్టేజ్ పెర్ఫామెన్స్ కోసం మెగాస్టార్ అమీర్ ఖాన్ ఒక్క పైసా కూడా వసూలు చేయలేదని తెలుస్తోంది.

విలాసవంతమైన ఈ వేడుక‌లో ముగ్గురు ఖాన్‌లు క‌లిసి క‌నిపించ‌డం కాక‌తాళీయ‌మ‌ని, చాలా ఆకస్మిక నిర్ణయమని వారిలో ఎవరూ ప్రదర్శన కోసం అంబానీల నుంచి ఎలాంటి బిల్లు వ‌సూలు చేయలేదని వెల్లడించారు. అంబానీల భారీ ప్రీవెడ్డింగ్ లో ప్ర‌ద‌ర్శ‌న కోసం అతిథులు డబ్బు చెల్లించమని అడిగితే అది స‌రైన‌దేనా? అన్న ప్ర‌శ్న వేసుకోవాలి. ఆ చిన్న ప్రదర్శన కోసం డబ్బు చేతులు మారాయి! అని ప్ర‌చారం చేయ‌డం స‌రికాదు. ఇదంతా ఊహాజ‌నిత‌మైన‌ది.

పెళ్లికి ముహూర్తం ఫిక్స్ :

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి గురించి చాలా కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ 29 డిసెంబర్ 2022న శ్రీనాథ్‌జీ ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత 2023 జనవరి 19న అంబానీల ముంబై నివాసంలో ఈ జంట అధికారిక నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న జామ్‌నగర్‌లో లగన్ లఖ్వాను వేడుకతో వీరిద్దరి వివాహానికి ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుండి 3 వరకు జరిగాయి. జూలై 12న ముంబైలో ఈ జంట వివాహం చేసుకోనుంది.

Tags:    
  • Bollywood 
  • Amirkhan 
  • Anantradhikawedding 
  • Celebrities 
  • Shahrukhkhan 
  • Salmankhan 
  • Danceperformance 
  • Mukeshambani 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS