చ‌నిపోయినా సినిమా ఆపొద్దు అంటోన్న స్టార్ హీరో!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా పట్ల తనకున్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు.;

Update: 2026-05-02 08:30 GMT

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా పట్ల తనకున్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు. ఒకవేళ తాను సినిమా చిత్రీకరణ మధ్యలో ఏదైనా ప్రమాదానికి గురై మరణించినా? ఆ సినిమాను ఆపకూడదని అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మరణం తర్వాత కూడా ప్రాజెక్ట్ పూర్తి కావాలనే పట్టుదలతో తన ప్రాణ స్నేహి తుడు, దర్శకుడు మన్సూర్ ఖాన్‌కు ప్రత్యేక నోట్ రాస్తానని అమీర్ పేర్కొన్నారు. దీంతో సినిమాపై అమీర్ కున్న ఫ్యాష‌న్ ఎంత గొప్ప‌ద‌న్న‌ది మ‌రోసారి ప్రూవ్ అయింది. పీక మీద క‌త్తి పెట్టి సినిమాలు ముఖ్య‌మా? ప్రాణాలు ముఖ్య‌మా? అని అడిగితే ప్రాణం పోయినా సినిమా మాత్ర‌మే కావాల‌నే న‌టుడు అమీర్ గా తెలుస్తోంది.

అమీర్ ఖాన్ నటుడిగానే కాదు. సినిమాను గొప్ప కళగా ఆరాధించే వ్యక్తి. ఒక చిత్రం కోసం సంవత్సరాల తరబడి శ్రమించడం, పాత్ర కోసం శారీరకంగా, మానసిక సిద్ధమవ్వడం ఆయన శైలి. అందుకే తాను లేక‌పోయినా? నమ్ము కున్న కథ వెండితెరపైకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. మన్సూర్ ఖాన్ వంటి నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారా సినిమాను పూర్తి చేయించి, ప్రేక్షకులకు అందించాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు పెట్టింది పేరు అమీర్ ఖాన్. `లగాన్` నుంచి `దంగల్` వరకు అమీర్ చేసిన ప్రతి ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్రను సృష్టించింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సమాజానికి సందేశాన్ని ఇచ్చే కథలను ఎంచుకోవడంలో అమీర్ ఎప్పుడూ ముందుంటారు.

అందుకే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులు అమీర్ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ తన రాబోయే ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా? ఆయన వెనక్కి తగ్గకుండా కొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా మేకింగ్‌లో ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ వెతికే ఆయన ప్రాణం పోయినా కళ నిలబడాలని కోరుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఒక లెజెండరీ నటుడిగా ఆయనకు దక్కుతున్న గౌరవం వెనుక ఉన్నది ఇలాంటి కఠోర దీక్షే అని చెప్పొచ్చు.

అమీర్ ఖాన్ తీసుకున్న నిర్ణయం సహజంగానే సినీ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే షూటింగ్‌లు నిలిపివేస్తారు. కానీ అమీర్ మాత్రం తన స్నేహితుడికి బాధ్యతలు అప్పగించి సినిమాను ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేయడం విప్లవాత్మక అడుగు. ఇది రాబోయే తరాలకు, యువ నటులకు సినిమా పట్ల ఉండాల్సిన నిబద్ధతను తెలియజేస్తోంది. అమీర్ ఖాన్ వ్యాఖ్యలు ఆయనలోని కళాకారుడి ఉన్నత స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. మనిషి శాశ్వతం కాదు. సృష్టించిన కళాఖండం శాశ్వతంగా ఉండాలనే అమీర్ తపన అభినందనీయం. అందుకే బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. అమీర్ ఖాన్ సినిమా అంటేనే నమ్మకం, నాణ్యత అనే ముద్రను ఎప్పుడో వేసారు.

Tags:    

Similar News