బన్నీ కొత్త కథ.. అసలు క్లారిటీ వచ్చినట్లే..
'కాంట్ వెయిట్ ఫర్ AA23' అంటూ ఆయన చేసిన రీసెంట్ పోస్ట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ప్రాజెక్ట్ పై వర్క్ జరుగుతుందనే విషయాన్ని పరోక్షంగా ఆయన చెప్పినట్టే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న AA23 సినిమా గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని, సినిమా ముందుకు వెళ్లడం లేదని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే తాజాగా బయటకు వస్తున్న సమాచారం మాత్రం ఆ రూమర్స్ కు చెక్ పెట్టేలా ఉంది.
గత 15 రోజుల్లో అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ రెండు సార్లు స్పెషల్ గా మీట్ అయ్యారని సమాచారం. ఆ సిట్టింగ్స్ నార్మల్ వి కావని, కంప్లీట్ గా AA23 ప్రాజెక్ట్ గురించే జరిగిన చర్చలని తెలుస్తోంది. కథలో చేయాల్సిన మార్పులు, పాత్రల డిజైన్, యాక్షన్ ఎపిసోడ్స్, స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ వంటి అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి లోకేశ్ కనగరాజ్ తన సినిమాల విషయంలో ఎలాంటి రాజీ పడరనే విషయం తెలిసిందే.
కథ విషయంలో పూర్తి సాటిస్ఫికేషన్ వచ్చిన తర్వాతే ఆయన షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ AA23 స్క్రిప్ట్ ను మరింత స్ట్రాంగ్ గా తీర్చిదిద్దే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే సినిమా స్టార్ట్ అవ్వడం లేట్ అవుతున్నప్పటికీ ప్రాజెక్ట్ మాత్రం ఆగిపోలేదని క్లియర్ గా తెలుస్తోంది. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా సినిమా రైటర్ రత్న కుమార్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ కూడా చర్చనీయాంశంగా మారింది.
'కాంట్ వెయిట్ ఫర్ AA23' అంటూ ఆయన చేసిన రీసెంట్ పోస్ట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ప్రాజెక్ట్ పై వర్క్ జరుగుతుందనే విషయాన్ని పరోక్షంగా ఆయన చెప్పినట్టే. దీంతో సినిమా నిలిచిపోయిందనే రూమర్లకు ఒక్కసారిగా చెక్ పడింది. మరోవైపు సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించనున్నారని వినికిడి. బడ్జెట్ సమస్యల వల్ల సినిమా ఆగిపోయిందనే ప్రచారంలో నిజం లేదనే అభిప్రాయం కూడా బలపడుతోంది.
ఇప్పటికే AA23 అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ అందించిన థీమ్ మ్యూజిక్ పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ అయింది. ఇన్ స్టాగ్రామ్ లో లక్షల సంఖ్యలో రీల్స్ రూపొందడంతో ఆ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సినిమా అధికారికంగా ప్రారంభం కాకముందే ఈ రేంజ్ క్రేజ్ రావడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న రాకా చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత AA23పై మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు లోకేశ్ కనగరాజ్ కూడా స్క్రిప్ట్ పనులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బన్నీ- లోకేశ్ మధ్య వరుసగా జరిగిన సిట్టింగ్స్ ఇప్పుడు AA23పై క్లారిటీ తీసుకొచ్చాయి. సినిమా ఆగిపోయిందనే ప్రచారానికి బదులుగా, ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ముందుకు సాగుతోందని తెలుస్తోంది. ఇక మూవీ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో ఉన్నప్పటికీ, భారీ మూవీ మాత్రం ట్రాక్ లోనే ఉందని క్లారిటీ వచ్చినట్లే.