2025 ఫ‌స్టాఫ్ లోని బెస్ట్ ఫిల్మ్స్ ఇవే..

నిన్న కాక మొన్న కొత్త సంవ‌త్స‌రంలోకి ఎంట‌రైన‌ట్టు ఉంది. కానీ అప్పుడే 2025 స‌గం అయిపోయింది.;

Update: 2025-05-12 09:31 GMT

నిన్న కాక మొన్న కొత్త సంవ‌త్స‌రంలోకి ఎంట‌రైన‌ట్టు ఉంది. కానీ అప్పుడే 2025 స‌గం అయిపోయింది. ఇండియ‌న్ సినీ ప‌రిశ్ర‌మ‌లు ఆల్రెడీ ఒకదాని త‌ర్వాత మ‌రొక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించ‌డానికి పోటీ ప‌డుతుండ‌గా, ఈ ఇయ‌ర్ ఇప్ప‌టికే ప‌లు సినిమాలు రిలీజ‌య్యాయి. అందులో కొన్ని క్రైమ్ థ్రిల్ల‌ర్లు, మ‌రికొన్ని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలు, ఇంకొన్ని కోర్టు రూమ్ డ్రామాలున్నాయి. 2025లో రిలీజై ఆడియ‌న్స్ ను మెప్పించిన కొన్ని స‌ర్‌ప్రైజింగ్ సినిమాల్లో టాప్ 5 సినిమాలేంటో చూద్దాం.

అందులో మొద‌టిగా అక్ష‌య్ కుమార్ న‌టించిన బాలీవుడ్ మూవీ కేస‌రి2 ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంది. దేశ‌భ‌క్తి ప్ర‌ధాన‌మైన ఈ కోర్టు రూమ్ డ్రామా వ‌రల్డ్ వైడ్ గా రూ.129.14 కోట్లు క‌లెక్ట్ చేసి ఆడియ‌న్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇండియ‌న్ హిస్ట‌రీ మ‌రియు ఎమోష‌న్స్ ను క‌లగ‌లిపి తెర‌కెక్కించిన ఈ సినిమా ఆడియ‌న్స్ ను విప‌రీతంగా అల‌రించింది.

టాలీవుడ్నుంచి వ‌చ్చిన కోర్టు: స్టేట్ వ‌ర్సెస్ ఎ నోబ‌డీ. నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ కోర్టు రూమ్ డ్రామా ఆడియ‌న్స్ ను విప‌రీతంగా మెప్పించింది. అంతేకాదు త‌క్కువ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.58.15 కోట్లు క‌లెక్ట్ చేసి నిర్మాత‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మంచి లాభాల్ని మిగిల్చింది.

కోలీవుడ్ నుంచి వ‌చ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా కూడా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే వ‌ల‌స కుటుంబం యొక్క‌ క‌థ‌గా ఈ సినిమా రూపొందింది. ఫ‌న్నీ ఫ్యామిలీ డ్రామాగా శ‌శి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు క‌లెక్ట్ చేసి మంచి హిట్ గా నిలిచింది. ఇక మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ నుంచి రీసెంట్ గా వ‌చ్చిన తుద‌ర‌మ్ సినిమా కూడా ఎమోష‌న‌ల్ రోల‌ర్ కోస్ట‌ర్ గా తెర‌కెక్కి ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మోహ‌న్ లాల్ హీరోగా వ‌చ్చిన ఈ సినిమా రూ.175 కోట్లు క‌లెక్ట్ చేసి సూప‌ర్ హిట్ గా నిలిచింది.

ఇక క్రైమ్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారు క‌న్న‌డ సినిమా అజ్ఞాత‌వాసిని త‌ప్పకుండా చూడాల్సిందే. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఎన్నో సీక్రెట్స్, ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్టుల‌తో మంచి స్క్రీన్ ప్లే తో ప్ర‌తీ ఒక్క‌రినీ అల‌రిస్తుంది. ఈ సినిమాల‌న్నీ చిన్న బ‌డ్జెట్ తో రూపొందిన‌వే. సినిమా హిట్ అవాలంటే దానికి ముఖ్యం బ‌డ్జెట్ కాద‌ని, ఆడియ‌న్స్ క‌థ‌కు క‌నెక్ట్ అయితే చాల‌ని ఈ సినిమాల‌న్నీ నిరూపించాయి. మొత్తానికి 2025 ఫ‌స్టాఫ్ చాలా బాగా స్టార్ట్ అయింది. మ‌రి 2025 సెకండాఫ్ లో ఎలాంటి మంచి సినిమాలు రానున్నాయో చూడాలి.

Tags:    

Similar News