మస్క్ పేరుతో మస్కా.. ఏకంగా రూ. 41 లక్షలు మాయం

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రూ. లక్షలు దండుకుంటున్నారు

Update: 2024-04-26 00:30 GMT

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రూ. లక్షలు దండుకుంటున్నారు. అప్పనంగా వచ్చే సొమ్ము కోసం పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అందుకు ప్రముఖ సంస్థల యజమానుల పేర్లతో టోకరా వేస్తున్నారు. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసే వారుంటారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేరుతో మోసం చేశారంటే అవతలి వ్యక్తిని ఎంతలా నమ్మారో తెలుస్తోంది. మస్క్ ఎక్కడ? మనమెక్కడ? ఆయనకు మనతో వ్యాపారం చేయాల్సిన అవసరం ఉంటుందా? ఆశకైనా ఓ హద్దు ఉండాలి.

దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్ జెసన్ సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. ఏకంగా రూ. 41 లక్షలు నష్టపోయింది. దీనికి దీప్ షేక్ వీడియో కారణమైంది. జులై 17న ఇన్ స్టాగ్రామ్ లో మస్క్ పేరుతో ఓ ఖాతా కనిపించింది. మొదట దాన్ని నమ్మకున్నా తరువాత నమ్మాల్సి వచ్చింది. దీంతో తనతో వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయని నమ్మబలికాడు.

దీంతో ఆమె మెల్లగా నమ్మింది. తరువాత నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బయి పోయింది. అంతటి మహామహుడు నన్ను ప్రేమించడం ఏమిటని ఆశ్చర్యానికి గురయింది. అతడికి డబ్బు పంపి వ్యాపారంలో భాగస్వామి అవుదామని అనుకుంది. కానీ అదొక దొంగ ఖాతా తరువాత తెలుసుకుని అవాక్కయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Read more!

అతడి మాయమాటలు నమ్మి రూ. 41 లక్షలు చేజార్చుకుది. 2022 జనవరి నుంచి జూన్ మధ్య ఇలాంటి నేరాలు 280 వరకు జరిగినట్లు కొరియా యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఆ దేశంలో మోసాలను కట్టడి చేసే దేశాల్లో సరైన నిబంధనలు లేకపోవడంతో నేరగాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది. ఇలాంటి వారు రెచ్చిపోయి అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు.

ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇలా మోసాలకు గురవుతూనే ఉన్నారు. రూ. లక్షల డబ్బు దోచుకునేందుకు కారకులవుతున్నారు. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో మోసాలకు పాల్పడే వారితో జాగ్రత్తగా ఉండాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News