• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Business >  ఇక 2 ’టాటాలు’.....

ఇక 2 ’టాటాలు’.. విడిపోనున్న దిగ్గజ సంస్థ.. షేరు ధర జంప్

| జంషెడ్ జీ టాటా నుంచి మొన్నటి రతన్ టాటా వరకు వ్యక్తిగతంగా భారతీయుల అభిమానాన్ని చూరగొన్నారు

By - Tupaki Desk
Update: 2025-05-08 12:22 GMT

భారతీయులతో భౌతికంగా కంటే భావోద్వేగం పరంగా ముడిపడి ఉన్న సంస్థ టాటా. జంషెడ్ జీ టాటా నుంచి మొన్నటి రతన్ టాటా వరకు వ్యక్తిగతంగా భారతీయుల అభిమానాన్ని చూరగొన్నారు. టాటా అంటే మనకు ఓ సంస్థ కాదు.. ఓ నమ్మకం. ఇది శతాబ్దం పైగా కొనసాగుతున్న నమ్మకం. దీనికి నిదర్శనమే ఇటీవల రతన్ టాటా మరణం అనంతరం దేశం స్పందించిన తీరు.

ఇక శతాబ్దంపైగా చరిత్ర ఉన్న టాటా సంస్థ త్వరలో రెండుగా విడిపోనుంది. ఈ కీలక పరిమాణానికి ఏకగ్రీవ ఆమోదం దక్కింది. టాటా గ్రూప్ లోని కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్. ఇది రెండుగా విడిపోనుంది. దీనికి కంపెనీ బోర్డు ఆమోదం లభించింది. కంపెనీ షేర్ హోల్డర్లు సైతం ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. ఈ ప్రకారం రెండు వేర్వేరు నమోదిత కంపెనీగా మారనుంది.

తాజాగా వెల్లడైన సమాచారంతో.. టాటా మోటార్స్ స్టాక్ దూసుకెళ్లింది.

ఉదయం సెషన్లోనే 4 శాతం పెరిగి నిఫ్టీ-50 సూచీలో టాప్ గెయినర్ గా నిలిచింది. కంపెనీని రెండుగా విభజించేందుకు షేర్ హోల్డర్లు ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో మదుపరుల స్టాక్స్ కొనేందుకు మొగ్గు చూపారు.

తాజాగా విభజనకు మూల కారణం.. టాటా మోటార్స్ నుంచి వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా మార్చాలనుకోవడమే. దీనికి 99.99 శాతం మంది వాటాదారులు సమ్మతి తెలిపారు. అంటే షేర్ హోల్డర్లు అందరూ సముఖంగా ఉన్నట్లే.

వాస్తవానికి టాటా మోటార్స్ ను రెండుగా విభజించే ప్రణాళిక నిరుడు మార్చిలోనే వెల్లడైంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నుంచి ఆమోదం కూడా వచ్చింది. తర్వాత షేర్ హోల్డర్ల ఆమోదానికి వెళ్లింది. తాజాగా ఈ ప్రక్రియ కూడా పూర్తయింది.

విభజన ఇలా..

టాటా మోటార్స్ విభజన ప్రకారం.. ఒక షేర్ ఉంటే రెండు కంపెనీల్లో షేర్లు దక్కుతాయి. ఇక విభజిత కంపెనీల్లో ఒకటి పూర్తిగా వాణిజ్య వాహనాల వ్యాపారం చేపడితే.. మరోటి ప్రయాణికుల వాహనాల వ్యాపారాన్ని నిర్వహిస్తుంది.

బలం ఇచ్చిన ఒప్పందం..

రెండు కంపెనీల ప్రకటనతో పాటు టాటా మోటార్స్ షేర్లు స్టాక్ మార్కెట్ లో రాణించడానికి కారణం.. ఇటీవల భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడమే. దీనిప్రకారం ప్రీమియం కార్లపై దిగుమతి సుంకాలను 10 శాతానికి తగ్గించనున్నారు. బ్రిటన్ లో తయారై భారత్ లోకి వచ్చే జాగ్వార్, ల్యాండ్ రోవర్‌ వంటి ఖరీదైన కార్లకు ఇది మంచి పరిణామం.

Tags:    
  • TataMotors 
  • TataSplit 
  • IndianIndustry 
  • TataGroup 
  • StockMarket 
  • RatanTata 
  • TataLegacy 
  • TataStocks 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

టాటా గ్రూప్‌లో ఏం జరుగుతోంది? జిమ్మీ టాటా లేఖతో కొత్త చర్చ

2026-11-17 10:03 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

ధన త్రయోదశి మరీ.. మనోళ్ల బంగారం కొనుగోళ్లు ఏం రేంజ్ లో ఉన్నాయంటే?

2026-11-07 06:50 GMT

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

2026-11-07 04:02 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

రోజుకు లక్ష కోట్లు.. భారత యూపీఐ పవర్ ఇదీ

2026-11-01 15:05 GMT

సినిమాలకు దూరంగా ఉన్నా.. భారీగా సంపాదిస్తున్న సమంత!

2026-10-22 12:30 GMT

వామ్మో ఇదేం తాగుడు? రోజులో రూ.303 కోట్ల లిక్కర్ సేల్

2026-10-22 08:00 GMT

3300 కోట్ల సంప‌ద సృష్టి వెన‌క సీక్రెట్.. ఈ న‌టుడు ఒక బ్యాడ్ బిజినెస్‌మేన్!

2026-10-16 09:30 GMT

UKలో బిజినెస్: క‌త్రిన కంటే ముందే స‌క్సెసైన టాప్-3 హీరోయిన్‌లు!

2026-10-13 03:38 GMT

Copyright @2026

Powered by Blink CMS