• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Business >  అమెరికా తుమ్మితే.. మన...

అమెరికా తుమ్మితే.. మన బంగారానికి జలుబు.. లక్షకు పడిపోతుందట.. త్వరపడండి..

| బంగారం ధరలు తులం రూ.1.48 లక్షల నుంచి రూ.1.28 లక్షలకు తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆశలు పెరుగుతున్నాయి. రూ.1.20 లక్షల స్థాయి దాటితే లక్ష రూపాయలకు చేరవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలపై ధరలు ఆధారపడి ఉంటాయని, బంగారం కొనుగోలును విడతల వారీగా చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-21 18:51 GMT

ఒకప్పుడు బంగారం ధర రూ. 50 వేలు దాటినప్పుడే అమ్మో.. ఇక బంగారం కొనడం మన వల్ల కాదురా బాబూ అని గుండెలు బాదుకున్న మధ్యతరగతి జీవికి.. ఇప్పుడు తులం బంగారం రూ. 1.48 లక్షల నుంచి కాస్త జారి రూ. 1.28 లక్షలకు రాగానే "ఆహా పసిడి ధరలకు భారీ షాక్.. ఇక చౌకైపోయింది" అంటూ మార్కెట్ నిపుణులు తీపి కబురు వినిపిస్తున్నారు. ఇదేం విడ్డూరమో కానీ ఆకాశాన్ని తాకిన ధరలు కాస్త మేఘాల స్థాయికి దిగిరాగానే ఇక నేరుగా మన జేబుల్లోకే వచ్చి పడతాయన్నంత రేంజ్‌లో ఆశలు రేకెత్తిస్తున్నారు.

టెక్నికల్ చార్టులు.. గ్రాఫులు అంటూ పెన్నులు తిప్పే నిపుణుల లెక్కల ప్రకారం.. బంగారం ప్రస్తుతం రూ. 1.28 లక్షల నుంచి రూ. 1.20 లక్షల మధ్య ఊగిసలాడుతోందట. ఈ రూ. 1.20 లక్షల అనే 'లక్ష్మణ రేఖ'ను బంగారం దాటి కిందకు పడితే ఏకంగా రూ. లక్ష మార్కును తాకుతుందని జోస్యం చెబుతున్నారు. లక్ష రూపాయల తులం బంగారాన్ని చౌక అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితికి మనం చేరుకున్నామన్నమాట.. ఒకవేళ అలా కాకుండా బంగారం మళ్లీ తన ప్రతాపం చూపించి రూ. 1.48 లక్షలు దాటితే మాత్రం బుల్లిష్ ట్రెండ్ మొదలైనట్టేనట. అంటే ఎటు తిరిగినా సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయమని అర్థం.

మన ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటే అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఏ దేశం ఏ దేశం మీద బాంబులు వేసుకుంటోందో డాలర్ విలువ ఎంత పెరిగిందో చూసుకోవాల్సిన పరిస్థితి.. అంతర్జాతీయంగా ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా చాలు, బంగారం ధర రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ఈ గ్లోబల్ రాజకీయాల ముందు మన దేశీయ డిమాండ్లు.. పెళ్లిళ్ల సీజన్లు అన్నీ బలాదూర్..

ధరలు తగ్గుతున్నాయి కదా అని ఉన్నదంతా ఊడ్చి ఒకేసారి కొనేయకండి.. విడతల వారీగా కొనండి అని నిపుణులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ధర ఇంకా తగ్గితే అప్పుడు మిగతాది కొనొచ్చట. మరి ఇంతలో పెళ్లి ముహూర్తం దాటిపోతే ఎలా సార్ అంటే.. అబ్బే శుభకార్యాల కోసం అయితే కనిష్ఠ ధర కోసం ఎదురుచూడకండి కొనేయండి అని చేతులెత్తేస్తున్నారు.

బంగారం రూ. లక్షకు పడిపోతుందనేది కేవలం మార్కెట్ విశ్లేషకుల ఊహాగానం మాత్రమే తప్ప.. గ్యారెంటీ కార్డు కాదు. కాబట్టి ఈ ఆశల పల్లకిలో ఊరేగకుండా.. మీ జేబు బరువును.. నగల షాపు వాడి మేకింగ్ ఛార్జీల బాదుడును దృష్టిలో పెట్టుకుని అడుగు వేయడం ఉత్తమం..

Tags:    
  • goldprice 
  • goldrates 
  • goldpriceprediction 
  • goldpricesindia 
  • goldmarket 

Similar News

జెన్సన్ హువాంగ్ కొత్త కంపెనీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడి? వైరల్ వార్త వెనుక అసలు విషయం!

2026-11-21 04:24 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

టాటా గ్రూప్‌లో ఏం జరుగుతోంది? జిమ్మీ టాటా లేఖతో కొత్త చర్చ

2026-11-17 10:03 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

ధన త్రయోదశి మరీ.. మనోళ్ల బంగారం కొనుగోళ్లు ఏం రేంజ్ లో ఉన్నాయంటే?

2026-11-07 06:50 GMT

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

2026-11-07 04:02 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

రోజుకు లక్ష కోట్లు.. భారత యూపీఐ పవర్ ఇదీ

2026-11-01 15:05 GMT

సినిమాలకు దూరంగా ఉన్నా.. భారీగా సంపాదిస్తున్న సమంత!

2026-10-22 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS