Begin typing your search above and press return to search.

అర్నబ్​ అరెస్ట్​ ను స్వాగతిస్తున్నాం.. మాకు న్యాయం జరిగింది

By:  Tupaki Desk   |   5 Nov 2020 3:00 AM GMT
అర్నబ్​ అరెస్ట్​ ను స్వాగతిస్తున్నాం.. మాకు న్యాయం జరిగింది
X
రిపబ్లిక్​ టీవీ సీఈవో అర్నబ్​ గోస్వామిని బుధవారం ఓ కేసు విషయంలో ముంబై పోలీసులు అరెస్ట్​ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో అర్నబ్​ గోస్వామిపై ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం మీడియా ముందుకు వచ్చింది. ఇంత కాలానికి తమకు న్యాయం జరిగిందని.. అర్నబ్​ తనకు ఉన్న పలుకుబడితో ఈ కేసును తప్పుదోవ పట్టించారని కానీ ముంబై పోలీసులు అర్నబ్​ను అరెస్ట్​ చేయడం తో తమకు న్యాయం గెలుస్తుందన్న నమ్మకం ఏర్పడిందని వారు చెప్పారు. రిపబ్లిక్​ టీవీ తమతో పనిచేయించుకొని బకాయిలు చెల్లించలేదని 2018 లో ఇంటీరియర్​ డిజైనర్​ అన్వే నాయక్​, ఆయన తల్లి కుమాద్​ నాయక్​ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై అన్వే నాయక్​ కుమార్తె అద్వా పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అర్నబ్​ రాజకీయ పలుకుబడి తో ఈ కేసు ముందుకు సాగ లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా ముంబై పోలీసులు ఈ కేసు ను తిరగదోడి అర్నబ్​ ను అరెస్ట్​ చేశారు.
ఈ కేసుపై అన్వే నాయక్​ కుమార్తె అద్వా మీడియాతో మాట్లాడుతూ.. ‘ 2018లో జరిగిన ఘటనను తాము ఎప్పటికీ మరిచిపోలేం. మా నాన్న సూసైడ్​ నోట్​లో ముగ్గురు పేర్లను ప్రస్తావించారు. అయితే వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా నాన్న మృతికి అర్నబ్​కే కారణం. అతడికి సాయం చేయవద్దని ప్రతి ఒక్కరిని వేడుకున్నా. ఇప్పుడు మహారాష్ట్ర పోలీసుల చర్యతో మాకు న్యాయం జరిగింది. మహారాష్ట్ర కుమార్తెకు అండగా నిలిచిన మహారాష్ట్ర పోలీసులకు ధన్యవాదాలు. నా జీవితాన్ని కూడా నాశనం చేస్తానంటూ అర్నబ్‌ నిరంతరం బెదిరించారు. ఈ కేసును మాజీ దర్యాప్తు అధికారి సురేశ్​ వాడరే తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. నా తండ్రి సూసైడ్‌ నోట్‌, పోస్టుమార్టమ్‌ రిపోర్ట్‌ కోసం 2019 ఫిబ్రవరి, మార్చి మధ్యలో అలీబాగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాం. దర్యాప్తు అధికారి సురేశ్‌ సంతకం చేయాలంటూ ఒక పేపర్‌ ఇచ్చారు. తాము ప్రతీకారం కోసమే ఫిర్యాదు చేశామని.. ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నట్లుగా అందులో ఉన్నది. అది చదివిన తర్వాత ఫోటో తీసేందుకు ప్రయత్నించగా ఆ అధికారి దానిని చింపివేశారు. మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారు’ అని అద్వా ఆరోపించారు. ఇప్పటికైనా మాకు న్యాయం జరుతుందని అని ఆమె పేర్కొన్నారు.