Begin typing your search above and press return to search.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా ఏంటి బ్రో.. మీమ్స్ గోల..

డైరెక్టర్ సముద్రఖని పేరుని సముద్రాల అని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి బదులు తమన్నా అని.

By:  Tupaki Desk   |   26 July 2023 8:42 AM GMT
మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా ఏంటి బ్రో.. మీమ్స్ గోల..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సినిమా బ్రో. తొలిసారి మామ, అల్లుళ్లు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు విడుదల చేసిన బ్రో మూవీ టైటిల్, పోస్టర్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు.

కాగా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిర్మాత విశ్వప్రసాద్ కు బంధువు, ప్రముఖ రాజకీయ నాయకుడు టిజి వెంకటేష్ హాజరయ్యారు. అయితే, ఆయన పాపం, మూవీ గురించి, మూవీలో నటీనటుల గురించి పెద్దగా తెలుసుకోకుండా వచ్చినట్లు ఉన్నారు. అప్పటికీ, ఫోన్ లో నటీనటుల పేర్లు పెట్టుకున్నప్పటికీ, చదవడంలో పొరపాట్లు చేశారు.

డైరెక్టర్ సముద్రఖని పేరుని సముద్రాల అని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి బదులు తమన్నా అని, సాయి ధరమ్ తేజ్ కి ధర్మ తేజ అని , కేతిక శర్మని కీర్తి శర్మ అంటూ పేర్కొనడం విశేషం. ఆయన అలా చెప్పడంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయారు. అయితే, ఆ తర్వాతే అసలు మ్యాటర్ మొదలైంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇంకా నయం పవన్ పేరు కూడా తప్పుగా చెప్పలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ స్పీచ్ మధ్యలో వైష్ణవ్ తేజ్ ఏదో చెవిలో చెప్పాడు. దానికి పవన్ సీరియస్ అయ్యి, చెబుతాను రా, అందరి పేర్లు చెబుతాను అంటున్న వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

అది మాత్రమే కాదు, బ్రహ్మానందం స్పీచ్ , అందులో ఆయన ప్రతిసారీ పవన్ బ్రో అంటూ పిలవడం చాలా హైలెట్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఇవే వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుండటం విశేషం.

ఇదిలా ఉండగా, ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ హిట్ మూవీ వినోదయ సీతం కి రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే, పవన్, తేజ్ ఈమేజ్ కి తగినట్లు కథలో మార్పులు చేశారు ఈ మూవీలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రాజా చెంబోలు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.