Begin typing your search above and press return to search.

తేజ‌స్ ట్రైల‌ర్: యుద్ధంలో ఖ‌త‌ర్నాక్ డేంజ‌ర‌స్ లేడీ

క్వీన్ కంగనా రనౌత్ న‌టించిన వ‌రుస సినిమాలు ఫ్లాపులుగా మారుతున్నాయి. ధ‌డ‌క్- త‌లైవి- చంద్ర‌ముఖి 2 ఫ‌లితాల గురించి తెఇసిందే.

By:  Tupaki Desk   |   8 Oct 2023 6:52 AM GMT
తేజ‌స్ ట్రైల‌ర్: యుద్ధంలో ఖ‌త‌ర్నాక్ డేంజ‌ర‌స్ లేడీ
X

క్వీన్ కంగనా రనౌత్ న‌టించిన వ‌రుస సినిమాలు ఫ్లాపులుగా మారుతున్నాయి. ధ‌డ‌క్- త‌లైవి- చంద్ర‌ముఖి 2 ఫ‌లితాల గురించి తెఇసిందే. అయితే వీట‌న్నిటికీ భిన్నంగా ఇప్పుడు భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ పై కంగ‌న క‌న్నేసింది. ప్ర‌స్తుతం కంగ‌న న‌టిస్తున్న ఎమ‌ర్జెన్సీ- తేజ‌స్ విడుద‌ల‌కు సిద్ధం కానున్నాయి. ఇందులో తొలిగా తేజస్ రిలీజ్ బ‌రిలో నిల‌వ‌నుంది. ఈ చిత్రం మూడేళ్లుగా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఎయిర్ స్ట్రైక్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న భారీ చిత్ర‌మిది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. అంత‌కుముందే ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా మేకర్స్ తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన తేజస్ అక్టోబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. యూరి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ బార్డ‌ర్ యాక్ష‌న్ మూవీని అందించిన మేక‌ర్స్ నుంచి వ‌స్తున్న చిత్రంగా తేజ‌స్ పై అంచ‌నాలున్నాయి.

ఈ వారం ప్రారంభంలో ఈ చిత్రం టీజర్ విడుద‌ల కాగా అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచింది. క‌చ్చితంగా అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించిన ట్రైల‌ర్ ఇది. కుర్చీ అంచుపైకి జారి ఎంతో ఉత్కంఠ‌గా వీక్షించే సినిమా ఇద‌ని భ‌రోసానిచ్చింది. పాక్ బార్డ‌ర్ లో భారీ యాక్షన్‌తో విధ్వంశ‌క‌ర వైమానిక‌ విన్యాసాల‌తో సినిమా గ‌గుర్పాటుకు గురి చేస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. మునుపెన్న‌డూ చూడని గొప్ప అనుభూతిని ఈ సినిమా ప్రేక్షకులకు అందించబోతోంద‌ని ట్రైల‌ర్ చెబుతోంది.

ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్‌గా కనిపించనుంది. టైటిల్ పాత్ర‌లో కంగ‌న ఎమోష‌నల్ పెర్ఫామెన్స్ ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. ముఖ్యంగా తీవ్ర‌వాదానికి ఎదురు తిర‌గ‌డం అనేది దేశంలోని ప్ర‌తి ఒక్క పౌరుడికి వ్య‌క్తిగ‌త విష‌యం! అంటూ కంగ‌న చెప్పే డైలాగ్ ఉద్రేకం క‌లిగిస్తుంది. ఖ‌త‌ర్నాక్ డేంజ‌ర‌స్ లేడీ అంటూ స‌హ‌చ‌రుల సంభాష‌ణ‌లు ఉత్కంఠ‌ను పెంచాయి. ఇందులో దేశం కోసం పోరాడే వైమానిక ద‌ళ కమాండ‌ర్ గా కంగ‌న న‌టించింది. ఈ సినిమా బయోపిక్ కాదని నిర్మాతలు గతంలోనే ధృవీకరించారు. టీజర్ లాంచ్‌తో వారు విడుదల తేదీని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబ‌ర్ లో టైగర్ ష్రాఫ్ `గణపత్‌`తో ఢీ కొడుతుంద‌ని ప్ర‌చారం సాగినా అలాంటిదేమీ లేద‌ని తేలింది.

మూడేళ్లుగా తేజస్ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. వీఎఫ్ ఎక్స్ కోసం టీమ్ ఎక్కువ స‌మ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించింది. ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 2020లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఆగస్ట్ 2020లో సినిమా విడుదల తేదీని కంగన ప్రకటించింది. ఆ సమయంలో మీడియా స‌మావేశంలో కంగనా మాట్లాడుతూ-``తేజస్ ఎగ్జ‌యిట్ చేసే అద్భుత‌మైన కథతో తెర‌కెక్కుతోంది. ఇందులో నేను ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ ని. ప్రతిరోజూ విధి నిర్వహణలో అపారమైన త్యాగాలు చేసే యూనిఫాంలో ఉన్న అధికారిగా క‌నిపిస్తాను. వైమానిక ద‌ళ కమాండ‌ర్ లుగా ఆడా మ‌గా క‌లిసి ప‌ని చేస్తారు. ఈ చిత్రంలో నేను భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. మా చిత్రం సాయుధ దళాలను దాని హీరోల విజ‌య‌గాధ‌ల‌ను సెల‌బ్రేట్ చేసే విధంగా ఉంటుంది. సర్వేష్ - రోనీ (రోనీ స్క్రూవాలా, నిర్మాత)తో కలిసి ఈ ప్రయాణం చేయడానికి సంతోషిస్తున్నాను`` అని తెలిపింది.