Begin typing your search above and press return to search.

సౌండ్ పార్టీ తో వచ్చేస్తున్న వీజే సన్నీ..!

వీజే సన్నీ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సినిమాల్లో హీరోగా సెటిల్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   19 Aug 2023 6:42 PM GMT
సౌండ్ పార్టీ  తో వచ్చేస్తున్న వీజే సన్నీ..!
X

వీజే సన్నీ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సినిమాల్లో హీరోగా సెటిల్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు హీరోగా నటించినా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. దీంతో, ఈసారి ఎలాగైనా సక్సెస్ కావాలని సౌండ్ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

వీజే స‌న్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెంబ‌ర్-1 నుంచి వస్తున్న సినిమా ఈ సౌండ్ పార్టీ. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తోంది. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు గా వ్యవహరిస్తున్నారు. జయ శంకర్ సమర్పిస్తున్నారు. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

కాగా, తాజాగా ఈ మూవీ టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు. డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ ఈ వెంట్ జరగడం విశేషం. ఆయన ఈ మూవీ గురించి మాట్లాడుతూ, టీజర్ చాలా బాగుందని చెప్పారు. ఈ సినిమాకి మోహిత్ అందించిన మ్యూజిక్ మరింత అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సినిమా మరో జాతిరత్నాలు అయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుందని, వీజే సన్నీకి ఈ సినిమా మంచి హిట్ గా మారుతుందన్నారు.

ఇది ఫుల్ కామెడీ మూవీ అని తెలుస్తోంది. ఫ్యామిలీ అంతా వెళ్లి ఈ సినిమా చూడాలని హీరో వీజే సన్నీ ఈ సందర్భంగా కోరారు. ఈ మూవీ కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

కాగా, సన్నీ గతంలో టీవీ సీరియల్స్ లో నటించేవాడు. ఆ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లి పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 5కి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత వరసగా సినిమా అవకాశాలు చేజిక్కించుకున్నాడు. కొన్ని సినిమాలు చేశాడు. కానీ అవి పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. మరి ఈ సౌండ్ పార్టీతో అయినా సన్నీ కెరీర్ మారుతుందేమో చూడాలి.