Begin typing your search above and press return to search.

వీడియో: సితార‌ క్వీన్ గానే కాదు క‌థానాయిక‌గాను..!?

సితార న‌టించిన వాణిజ్య ప్ర‌క‌ట‌న ఇటీవ‌లే విడుద‌లై సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 July 2023 4:57 AM GMT
వీడియో: సితార‌ క్వీన్ గానే కాదు క‌థానాయిక‌గాను..!?
X

స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. న‌టుడు చంకీ పాండే కుమార్తె అన‌న్య పాండే.. శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ క‌పూర్ ఇప్ప‌టికే స్టార్లుగా సినీవినీలాకాశంలో ఓ వెలుగు వెలుగుతున్నారు. కేవ‌లం నాలుగైదేళ్ల‌కే న‌ట‌వార‌సురాళ్లంతా అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నారు.





త్వ‌ర‌లోనే కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సురాలు సుహానా ఖాన్ క‌థానాయిక‌గా స‌త్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. జోయా అక్త‌ర్ తెర‌కెక్కిస్తున్న ది ఆర్చీస్ తో సుహానా న‌టిగా ప‌రిచ‌య‌మ‌వుతోంది. ఇదే సిరీస్ తో శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీ క‌పూర్ కూడా క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతోంది.

ఇప్పుడు టాలీవుడ్ రాకుమారుడు (ప్రిన్స్) మ‌హేష్‌ వార‌సురాలు సితార ఘ‌ట్ట‌మ‌నేని క‌థానాయిక‌గా సినీఆరంగేట్రం చేయ‌నుంద‌ని అభిమానుల‌కు స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. సితార న‌టించిన వాణిజ్య ప్ర‌క‌ట‌న ఇటీవ‌లే విడుద‌లై సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఇందులో సితార అప్పియ‌రెన్స్ చూడ‌గానే త‌న‌కంటే చాలా సూప‌ర్ సీనియ‌ర్లు అయిన న‌ట‌వార‌సురాళ్లు సైతం కుళ్లుకునేంత బ్రిలియంట్ పెర్ఫామెన్స్ త‌న సొంతం అని నిరూపించింది. తండ్రికి త‌గ్గ త‌న‌యురాలిగా సితార ఏల‌డం ఖాయ‌మ‌న్న సంకేతాలు అందాయి. సితార ఘ‌ట్ట‌మ‌నేని ఆరంగేట్రం పై అభిమానులు అంతే ఉత్సాహంగా ఉన్నారు.

11 ఏళ్ల వ‌య‌సులో సితార న‌ట‌ప్రతిభ చాలా మంది విశ్లేష‌కుల‌ను సైతం అబ్బుర‌ప‌రిచింది. సితార‌కు ఎంతో గొప్ప భ‌విష్య‌త్ ఉంద‌ని అంద‌రూ కితాబిచ్చారు. న‌ట‌న‌లోనే కాకుండా డ్యాన్సుల్లోను సితార ఇప్ప‌టికే త‌ర్ఫీదు పొందింది. భ‌ర‌త‌నాట్యం కూచిపూడి స‌హా క్లాసిక్ డ్యాన్స్ ల్లో శిక్ష‌ణ పొందిన సితార‌కు సినీడ్యాన్సులు పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. అత్యంత వేగంగా న‌టిగా ఎదిగేందుకు అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల స్కిల్స్ ని సితార పెంపొందించుకుంది. అందుకే ఇక సితార సినీఎంట్రీకి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని అభిమానుల్లో టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు యూనివ‌ర్శ్ లు మ‌ల్టీవ‌ర్శ్ లు అంటూ బోలెడంత హంగామా న‌డుస్తోంది. నాయికా ప్ర‌ధాన వెబ్ సిరీస్ ల హ‌వా కూడా న‌డుస్తోంది. న‌ట‌నా రంగంలో నాయికా ప్రాధాన్య‌త పెరిగింది. సితార ఆరంగేట్రం అన‌వ‌స‌ర‌మైన గ్లామ‌ర్ అంశాల జోలికి వెళ్ల‌కుండా నెమ్మ‌దిగా స్టార్ డ‌మ్ ని పెంచుకునేందుకు త‌న‌దైన యూనిక్ ప్లానింగ్ తో ముందుకు సాగుతుంద‌ని విశ్లేషిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు నెమ్మ‌దిగా ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ఘ‌ట్ట‌మనేని న‌ట‌వార‌సురాలి కోసం ప్లానింగ్ సాగుతుంద‌ని కూడా భావిస్తున్నారు. నేడు సితార ఘ‌ట్ట‌మ‌నేని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల నుంచి సోష‌ల్ మీడియాల్లో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. తుపాకి త‌ర‌పున ఈ కుంద‌న‌పు బొమ్మ‌కు ప్ర‌త్యేక పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.