Begin typing your search above and press return to search.

సమంతతో పార్టీ.. ఆ మాత్రం ఉంటది మరి..!

మరో అమ్మాయితో కలిసి ఓ ఫీట్ చేసింది. తన కాళ్లపై మరో అమ్మాయిని లేపింది. చాలా సింపుల్ గా చేసేసింది.

By:  Tupaki Desk   |   26 July 2023 7:21 AM GMT
సమంతతో పార్టీ.. ఆ మాత్రం ఉంటది మరి..!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియనివారు ఎవరూ ఉండరేమో. ఆమె దాదాపు దశాబ్ధానికి పైగా సినిమాలు చేస్తూ, దక్షిణాది ప్రజలను అలరిస్తూ వస్తున్నారు. ఆమెకు రోజు రోజుకీ క్రేజ్ పెరుగుతుందే కానీ, తగ్గుతున్నది లేదు. ముఖ్యంగా, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌లో తన నటనతో జాతీయ దృష్టిని ఆకర్షించినప్పటి నుండి సమంత క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది.

అయితే, ఆమె తన అనారోగ్య కారణాల వల్ల సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నా కూడా ఆమె మాత్రం సినిమాలు చేయడానికి అస్సలు సముఖతగా లేరు. ఆమె తన ఆరోగ్యం పూర్తిగా సెట్ అయ్యే వరకు మళ్లీ ఎలాంటి సినిమా చేయాలని అనుకోవడం లేదు.

ప్రస్తుతం సమంత మూవీలకు బ్రేక్ ఇవ్వడంతో, తనకు నచ్చిన పనులు చేసుకుంటూ ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. మొన్నటి వరకు ఆధ్యాత్మిక మార్గంలో పయనించిన ఆమె, ప్రస్తుతం ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో రెండు వీడియోలు షేర్ చేసింది. అందులో ఆమె చేసిన విన్యాసాలు చూస్తుంటే, మైండ్ డ్లాక్ అయిపోతుంది.

మరో అమ్మాయితో కలిసి ఓ ఫీట్ చేసింది. తన కాళ్లపై మరో అమ్మాయిని లేపింది. చాలా సింపుల్ గా చేసేసింది. దానికి ఇది మా పార్టీ అంటూ క్యాప్షన్ పెట్టారు. మరో అమ్మాయిని కూడా ఆమె ట్యాగ్ చేశారు. పార్టీ అంటే ఇదా అని అందరూ షాకౌతున్నారు. కాగా, మామూలుగానే సమంతకు ఫిట్నెస్ మీద ఫోకస్ ఎక్కువ. ఎప్పటికప్పుడు చాలా కష్టమైన వ్యాయామాలు చేస్తూ ఉంటుంది.

ఇక, ఇప్పుడు ఆమెకు ఫ్రీ టైమ్ కూడా దొరకడంతో ఇప్పుడు మరింత ఎక్కువ కసరత్తులు చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా, సమంత ఇటీవల ఖుషీ, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేసేసుకుంది. కొత్త సినిమా ఏదీ చేయకపోయినా, ఆమె వీటి ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.