Begin typing your search above and press return to search.

'ప్రతినిధి 2' కాన్సెప్ట్ టీజర్​.. నారా రోహిత్ థ్రిల్లింగ్ పాయింట్!

ఏపీలో రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌ నడుస్తోంది

By:  Tupaki Desk   |   26 July 2023 6:41 AM GMT
ప్రతినిధి 2 కాన్సెప్ట్ టీజర్​.. నారా రోహిత్ థ్రిల్లింగ్ పాయింట్!
X

కమర్షియల్ ఫార్మాట్‏లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నారా రోహిత్​. చివరిసారిగా వీరభోగ వసంత రాయలు సినిమాలో కనిపించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు ప్రతినిధి 2తో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన రోజుకో అప్డేట్ ఇస్తున్నారు. తాజాగా.. మరో కొత్త అప్డేట్​ ఇచ్చారు. జులై 25 రోహిత్ పుట్టినరోజు సందర్భంగా సినిమా కాన్సెప్ట్​ టీజర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​.

ఈ వీడియో అంతా బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ విజువల్స్​.. వార్తాపత్రికలను హైలైట్ చేస్తూ చూపించారు. ఆ పత్రికల్లో ఓట్లు మాయం, యువత రావాలి, హింస పెరిగిపోతోంది వంటి హెడ్​ లైన్స్​ను బాగా హైలైట్​ చేసి చూపించారు. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ కార్యాలయంలో బాంబ్ బ్లాస్​ జరిగి అది పేలిపోతుంది. దాని వెనకే.. వేల మంది జనం ఉన్న పొలిటికల్ మీటింగ్ సభ ఒకటి జరుగుతున్నట్లు చూపించారు.

సమాజంలో జరిగే అసమానతలను ఎదుర్కొనేందుకు ఒక్కడు నిలబడతాడు అంటూ మళ్లీ ఫస్ట్ లుక్​ పోస్టర్​ చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తంగా ఈ వీడియో చూస్తుంటే ఇది ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్‌ థ్రిల్లర్‌ అని అర్థమవుతోంది.

ఇకపోతే ఈ ప్రతినిథి 2 సినిమా విషయానికొస్తే.. తొమ్మిదేళ్ల క్రితం నారా రోహిత్ హీరోగా చేసిన ప్రతినిధికి సీక్వెల్ ఇది. తొలి భాగం అప్పట్లో సెన్సేషనల్​ హిట్ అయింది. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్​ను బాగానే ఆకట్టుకుంది. ఈ రెండో భాగం ఫస్ట్ లుక్ పోస్టర్​ కూడా సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. దీనికి టీవీ-5 సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి దర్శకత్వం వహించబోతుండటం విశేషం.

ఏపీలో రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌ నడుస్తోంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. వానరా ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్‌పై.. కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫీ బాధ్యతలు చూసుకోబోతున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్​గా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.