Begin typing your search above and press return to search.

'పెద్ద కాపు' ఫస్ట్ సింగిల్.. మిక్కీ లైన్ లోకి వచ్చాడా?

శ్రీకాంత్ అడ్డాల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By:  Tupaki Desk   |   25 July 2023 11:37 AM GMT
పెద్ద కాపు ఫస్ట్ సింగిల్.. మిక్కీ లైన్ లోకి వచ్చాడా?
X

'అరెరే అరెరే తనవాటమే.. అసలే పడదే మొహమాటమే.. పలుచగా వేసినా... పావడ గోడ దాటినా... జరపదు ఎందుకో.. తెలిసేనా?'.. ఏంటి చదువుతుంటే అర్థం కాలేదా.. దీనికి కాస్త ట్యూన్ కట్టిన సాంగ్ వింటే అదిరిపోయింది అంటారు మీరే. ఇంతకీ ఇది ఏ సినిమాలో అంటే.. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తీస్తున్న కొత్త చిత్రంలోనిది.

సాధారణంగా శ్రీకాంత్ అడ్డాల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెరకెక్కించే చిత్రాల్లో మ్యూజిక్, సాంగ్స్ కు పెద్ద పీట వేస్తారు. అవి ఎంతో వినసొంపుగా ఉంటూ శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంటాయి. ఆయన పేరు వినగనే.. ఫ్యామిలీ రిలేషన్స్ సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. 'కొత్త బంగారు లోకం' నుంచి 'బ్రహ్మోత్సవం' వరకు అన్నీ అలాంటివే తీశారు.

అయితే 'నారప్ప'తో మాస్ బాట పట్టిన ఆయన... 'పెద్ద కాపు'తో రాజకీయ నేపథ్యంలో మాస్ అండ్ ఇంటెన్సివ్ చిత్రాన్ని తీశారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ పై మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది మూవీటీమ్. 'చనువుగా సాగే అరెరే అరెరే తనవాటమే..' అంటూ చిత్రంలోని లవ్ సాంగ్ ను జూలై 27న రిలీజ్ చేయనున్నారు. హీరో హీరోయిన్లపై ఈ సాంగ్ ను చిత్రీకరించారు. తెరకెక్కించారు. అంతకు ముందు శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు సంగీతం అందించిన మిక్కీ జె మేయరే ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ ప్రోమో ఎంతో వినసొంపుగా మనసును తాకేలా ఉంది. ఇందులో హీరోను రగ్డ్ లుక్ లో.. హీరోయిన్ ను సాఫ్ట్ లుక్ లో బాగా చూపించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో బాగుంది. ఇప్పటికే ఈ ప్రోమో విన్నవారు మిక్కీ జె మేయరే తమ మార్క్ మెలోడీతో అదరగొట్టేశారని అంటున్నారు. పూర్తి పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. ఇకపోతే చిత్రంలోని అన్ని పాటలకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది.