Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్: అమ్మాయిగా మారిన అబ్బాయితో హీరోగారి క‌ష్టాలు

త‌మిళం - తెలుగు ప‌రిశ్ర‌మ‌ల్లో రాణించిన యువ‌న‌టుడు ఆది పినిశెట్టి. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం - పార్ట‌న‌ర్.

By:  Tupaki Desk   |   15 Aug 2023 6:35 AM GMT
ట్రైల‌ర్: అమ్మాయిగా మారిన అబ్బాయితో హీరోగారి క‌ష్టాలు
X

త‌మిళం - తెలుగు ప‌రిశ్ర‌మ‌ల్లో రాణించిన యువ‌న‌టుడు ఆది పినిశెట్టి. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం - పార్ట‌న‌ర్. ఈ చిత్రానికి మనోజ్ ధామోదరన్ దర్శకత్వం వహించారు. ఈ ఫాంటసీ కామెడీ కం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో హన్సిక మోత్వాని క‌థానాయిక‌. బీజీ గోవిందరాజు సమర్పణలో ఫన్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎంఎస్‌ మురళీధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మారుతి చేతుల‌మీదుగా ఈరోజు విడుదల చేశారు.

అంద‌మైన అమ్మాయిగా మారిన స్నేహితుడు యోగిబాబుతో ఆది పినిశెట్టి పాట్లు ఏంటి? అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. ట్రైల‌ర్ ఆద్యంతం ఫ‌న్ ఎలిమెంట్ తో ర‌క్తి క‌ట్టిస్తోంది. ఆది - యోగి బాబు పాత్రలను సన్నిహితులుగా పరిచయం చేయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. చాలా డబ్బు అవసరం ఉన్న ఆది యోగి బాబుతో కలిసి ఒక సైంటిస్ట్ ల్యాబ్ లో దోపిడీ పనికి అంగీకరించాడు. కానీ అక్క‌డ ఊహించని సంఘటన జరుగుతుంది. ఫలితంగా యోగి బాబు స్త్రీ (హన్సిక మోత్వాని)గా మారిపోతాడు. ఆ త‌ర్వాత లేడీగా మారిన స్నేహితుడితో ఆదికి ఎలాంటి చిక్కులు ఎదుర‌య్యాయి? అన్న‌ది ఫ‌న్నీ వేలో చూపించారు.

ఆది పినిశెట్టి, యోగి బాబు కలిసి చక్కని నవ్వులు పూయించారు. హన్సిక ఎంట్రీ తర్వాత వినోదం రెట్టింపు అయ్యింది. ఈ కాంబినేష‌న్ థియేటర్లలో గొప్ప కామెడీని అందించబోతోంది. పల్లక్ లల్వానీ ఆది లేడీ లవ్‌గా కనిపించింది.

ఎంచుకున్న‌ కథాంశం యూనిక్ .. కథనం స‌ర‌దాగా సాగిపోతుంది. ఈ చిత్రానికి సంతోష్ ధయానిధి సంగీత దర్శకుడు కాగా, షబ్బీర్ అహ్మద్ సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్ ప్రదీప్ రాఘవ్. నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా ఆగష్టు 25 న ఈ చిత్రాన్ని తెలుగు - తమిళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. పాండిరాజన్, రోబో శంకర్, జాన్ విజయ్, రవి మారియా, టైగర్ తంగదురై త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: M.S. మురళీధర్ రెడ్డి, సంగీతం: సంతోష్ ధయానిధి, సినిమాటోగ్రఫీ: షబీర్ అహ్మద్.