Begin typing your search above and press return to search.

'నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్‌ లెస్‌ ఫెలో'!

ఈ సందర్భంగా... భవనాలు, రోడ్లు, ఇతర నిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ... వర్షాకాలంలోనూ పనుల్లో జాప్యం ఉండకూడదని ఆదేశించారు.

By:  Tupaki Desk   |   23 July 2025 3:47 PM IST
నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్‌ లెస్‌ ఫెలో!
X

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం తమ ప్రభుత్వ కీలక లక్ష్యాలను చంద్రబాబు ఒక్కమాటలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని అన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ... ప్రధానంగా ఈ దఫా అయినా ఏపీకి పరిపూర్ణమైన రాజధానిని తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు.

దీంతో... పురపాలకశాఖ మంత్రి నారాయణ భుజస్కందాలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని అంటున్నారు. ఈ సమయంలో నారాయణ మెజారిటీ సమయం అమరావతి నిర్మాణంపైనే పెడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అమరావతి నిర్మాణ పనులపై నారాయణ సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై సీఆర్డీఏ, ఏడీసీ ఇంజినీర్లతో చర్చించారు.

ఈ సందర్భంగా... భవనాలు, రోడ్లు, ఇతర నిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ... వర్షాకాలంలోనూ పనుల్లో జాప్యం ఉండకూడదని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కార్మికులు ఉపయోగిస్తున్న యంత్రాల గురించి అధికారులు ఆయనకు వివరించారు.

ఆ సమీక్ష అనంతరం తాజాగా స్వయంగా క్షేత్ర స్థాయికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు మంత్రి నారాయణ. ఇందులో భాగంగా రాజధానిలో పనులు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, అధికారులతో మాట్లాడారు. ఈ సమయంలో ఓ కాంట్రాక్టర్ పై మంత్రి చిందులు తొక్కుతూ నిప్పులు చెరిగారు!

అవును... తాజాగా రాజధాని ప్రాంతంలో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా... హైకోర్టు జడ్జిల బిల్డింగ్స్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న కాంట్రాక్టర్ ని... ఈ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. వచ్చే నెల 25నాటికి పూర్తవుతాయని చెప్పే ప్రయత్నం చేశారు.

దీంతో... ఒక్కసారిగా మంత్రి ఫైరయ్యారు. ఆ మాటలకు తీవ్ర అసహనానికి లోనైన నారాయణ... 'నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్‌ లెస్‌ ఫెలో' అంటూ అందరిముందూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.