Begin typing your search above and press return to search.

'నా నా' ట్రైలర్: శరత్ కుమార్ (Vs) శశికుమార్

శరత్ కుమార్, శశికుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ `నా నా` ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   13 Aug 2023 4:31 AM GMT
నా నా ట్రైలర్: శరత్ కుమార్ (Vs) శశికుమార్
X

శరత్ కుమార్, శశికుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ `నా నా` ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్వీ నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళం - తెలుగులో విడుదల కానుంది. ఇదిలా ఉంటే మేకర్స్ ఇప్పుడు యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. దాదాపు 90 సెకనుల ట్రైలర్ మూవీ కథాంశం గురించి పెద్దగా వెల్లడించలేదు. అయితే ఇద్ద‌రు దిగ్గ‌జాల్లాంటి స్టార్ల‌తో స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కించార‌ని స్ప‌ష్ఠ‌త‌నిచ్చింది. శ‌ర‌త్ కుమార్ వ‌ర్సెస్ శశికుమార్ న‌టించిన‌ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ఇద‌ని క్లారిటీనిచ్చింది. ఈ చిత్రంలో సీక్రెట్ గతం ఉన్న మాజీ పోలీసు అధికారిగా శ‌శికుమార్ న‌టించ‌గా.. శరత్ కుమార్ కూడా పోలీస్ అధికారిగా నటించారు.

ట్రైల‌ర్ ఆద్యంతం శ‌శికుమార్ తో శ‌ర‌త్ కుమార్ ఎలుకా పిల్లి ఆట ర‌క్తి క‌ట్టిస్తోంది. అయితే అడ‌విలో సింహ‌మా మేకా? అన్న‌ది తేల్చుకునే ప‌నిలో ఉన్న శ‌శికుమార్ గ‌తం ఏమిట‌న్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే. అత‌డిని ఆ గ‌తం ఎందుకు వెంటాడుతోంది? శ‌ర‌త్ కుమార్ తో అత‌డి శ‌త్రుత్వం దేనికి? అన్న‌ది కూడా సస్పెన్స్ ఎలిమెంట్. ట్రైల‌ర్ ఆద్యంతం స్టైలిష్ పెర్ఫామెన్సెస్ తో ర‌క్తి క‌ట్టిస్తోంది.

దర్శకుడు కమ్ నటుడు పి భారతిరాజా ఈ తమిళ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండగా `అందాల రాక్షసి` ఫేమ్ రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. సలీం- హీస్ట్ థ్రిల్లర్ `సతురంగ వెట్టై 2` తర్వాత NV నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం ఇది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంది. నా నా నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. పీకే రామ్ మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా, గణేష్ చంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.