Begin typing your search above and press return to search.

భోళా మిల్కీ బ్యూటీ అగాయా..ఎలా ఉందంటే..

తాజాగా పాట మొత్తాన్ని విడుదల చేశారు. ఈ పాటలో మెగాస్టార్, చిరుల కెమిస్ట్రీ అదిరిపోయింది.

By:  Tupaki Desk   |   21 July 2023 12:43 PM GMT
భోళా మిల్కీ బ్యూటీ అగాయా..ఎలా ఉందంటే..
X

మెగాస్టార్ భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు ఈ భోళా శంకర్ తో మరో హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మూవీ విడుదలకు దగ్గరపడుతుండటంతో, పాటలు విడుదల చేస్తూ, హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ మూవీలో చిరు సరసన ఈ మూవీలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ మూవీలోని ఓ పాటను విడుదల చేశారు. నిన్న పాట ప్రోమో వదిలి క్యూరియాసిటీ పెంచిన మూవీ టీమ్, తాజాగా పాట మొత్తాన్ని విడుదల చేశారు. ఈ పాటలో మెగాస్టార్, చిరుల కెమిస్ట్రీ అదిరిపోయింది. చిరు చాలా స్టైలిష్ గా కనపడగా, తమన్నా చాలా హాట్ గా కనిపించింది.

‘మిల్కీ బ్యూటీ .. నువ్వే నా స్వీటీ’ అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ స్వరపరిచారు. ఈ పాటను మంచు కొండల మధ్య చిత్రీకరించినట్లు తెలుస్తోంది. లొకేషన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక చిరు డ్యాన్స్ ఎలా వేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమన్నా కూడా మంచి డ్యాన్సరే కావడంతో, చిరుతో సమానంగా స్టెప్పులు వేసి అదరగొట్టింది.

ఇక, ఈ సినిమా 2015లో అజిత్ నుంచి వచ్చిన సూపర్ హిట్ 'వేదాళం' చిత్రానికి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చిరుకి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఆ గస్టులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ మూవీ తర్వాత చిరు, గోల్డ్ బాక్స్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నారు. ఈ మూవీకి బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గోల్డ్ బాక్స్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, ఆమె భర్త విష్ణుప్రసాద్ లకు చెందినది కావడం విశేషం. వీరి బ్యానర్ లో వస్తున్న తొలి సినిమా ఇది కావడం విశేషం.