Begin typing your search above and press return to search.

లవ్ స్టీరియో: ఆమె ప్రేమ పిశాచి అత‌డు య‌వ్వ‌న రాకాశి!

ఇటీవల ఆవిష్కరించిన సాంగ్ టీజర్ క‌ళ్ల‌కు ఒక సూప‌ర్ సోనిక్ సింఫొనీ హాయిని అందిస్తోంది.

By:  Tupaki Desk   |   20 July 2023 2:49 PM GMT
లవ్ స్టీరియో: ఆమె ప్రేమ పిశాచి అత‌డు య‌వ్వ‌న రాకాశి!
X

కండల హీరో టైగ‌ర్ ష్రాఫ్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ల‌తో యాక్ష‌న్ ప్రియుల హృద‌యాల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. హృతిక్ రోష‌న్ త‌ర్వాత అంత‌టి భారీ స్టంట్స్ డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టే హీరోగా టైగ‌ర్ ష్రాఫ్ పాపుల‌ర‌య్యాడు. అయితే ఇప్పుడు టైగ‌ర్ చేస్తున్న ఈ కొత్త ప్ర‌య‌త్నం కుర్రకారు గుండెల్ని గిల్లుతోంది.



ఈసారి ఒక సింగిల్ ఆల్బ‌మ్ తో యువ‌త‌రం హృద‌యాల‌ను గెలుచుకునేందుకు అత‌డు చేస్తున్న ప్ర‌య‌త్నం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. టి- సిరీస్ భూషణ్ కుమార్ నిర్మించిన మోస్ట్ అవైటెడ్ మాస్టర్ పీస్ `లవ్ స్టీరియో ఎగైన్`లో టైగర్ ష్రాఫ్ - జరాహ్ ఎస్ ఖాన్ ల మధ్య కెమిస్ట్రీ మ‌రో లెవ‌ల్లో వ‌ర్క‌వుటైంద‌న‌డానికి ఈ సింగిల్ టీజ‌ర్ ఒక ఉదాహ‌ర‌ణ‌.

ఇటీవల ఆవిష్కరించిన సాంగ్ టీజర్ క‌ళ్ల‌కు ఒక సూప‌ర్ సోనిక్ సింఫొనీ హాయిని అందిస్తోంది. ఊపిరి బిగ‌బ‌ట్టి వీక్షించే అంద‌మైన విజువ‌ల్స్ తో విజువ‌ల్ బ్యూటీని ఆస్వాధించే అరుదైన అవ‌కాశ‌మిద‌ని చెప్పాలి. టీజ‌ర్ ఆద్యంతం ఉద్విగ్న‌త‌ను ర‌గిలిస్తోంది. ప్ర‌తి ఫ్రేమ్ లో టైగ‌ర్ మెలితిరిగిన కండ‌లు 8 ప్యాక్ ని ఆవిష్క‌రిస్తూనే అందాల క‌థానాయిక సిజ్లింగ్ అవ‌తార్ ని అంతే అందంగా ఎలివేట్ చేసారు.

చూడ‌చ‌క్క‌ని సిజ్లింగ్ అందాలు ఎన‌ర్జీతో ప్రతి ఫ్రేమ్ ని ద‌ర్శ‌కుడు అలంక‌రించిన తీరు ఆక‌ట్టుకుంది. ఈ పాట‌కు మనీష్ షుంటి దర్శకత్వం వహించారు. ఆయ‌నే రచయిత‌. ఇంటర్నేషనల్ మ్యూజిక్ మాస్ట్రో ఎడ్వర్డ్ మాయ - ఏస్ కంపోజర్ తనిష్క్ బాగ్చితో కలిసి రూపొందించిన ఈ కళాఖండాన్ని టైగర్ - జహ్రా ఆల‌పించారు.

ఈ పాట సాహిత్యాన్ని ప్రతిభావంతులైన శ్రద్ధా పండిట్ (హిందీ) .. అంతర్జాతీయ పాటల రచయితలు ఎడ్వర్డ్ మరియన్.. ఎల్దార్ మన్సురోవ్ ..కార్నెవా విక్టోరియా రాశారు. ఆకట్టుకునే విజువల్స్ .. శ్రావ్యమైన సంగీతంతో `లవ్ స్టీరియో ఎగైన్` జూలై 21న అల‌రించ‌నుంది. T-సిరీస్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ పాట‌ విడుదల కానుంది.