Begin typing your search above and press return to search.

కొట్టరా కొట్టు తినుమారు.. భోళా నుంచి మరో మాస్ బీట్

మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా భోళా శంకర్ ఈ వారంలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

By:  Tupaki Desk   |   7 Aug 2023 3:12 PM GMT
కొట్టరా కొట్టు తినుమారు.. భోళా నుంచి మరో మాస్ బీట్
X

మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా భోళా శంకర్ ఈ వారంలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్లో అయితే నిర్మించారు. ఇక ఎలాగైనా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలి అనే చిత్ర యూనిట్ సభ్యులు అయితే గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు వరుస ఇంటర్వ్యూలను కూడా ఇచ్చిన భోళా శంకర్ టీం ఇప్పుడు మరొక సాంగ్ అయితే రిలీజ్ చేసింది. కొట్టరా కొట్టు తీనుమారు అనే పాట మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగానే ఉంది. మొన్నటి వరకు విడుదలైన సాంగ్స్ పరవాలేదు అనిపించగా ఇప్పుడు ఈ మాస్ బీట్ కూడా మెగా ఫాన్స్ కు జోష్ అయితే నింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

భోళా శంకర్ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు ఈ సాంగ్ తో మరోసారి అర్థమైంది. కొట్టర కొట్టు తీనుమారు పాట లో మంచి బీట్ తో పాటు సంగీత దర్శకుడు మహతి సాగర్ మెలోడీ ట్యూన్ కూడా హైలెట్ చేశాడు. ఇక ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా కాసర్ల శ్యామ్ రచన చేశారు.

రాహుల్ సిప్లిగంజ్ మరోసారి తన వాయిస్ తో మ్యాజిక్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ స్టెప్పులు కూడా చాలా స్టైలిష్ గా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. వీడియోలో కొన్ని మేకింగ్ షాట్స్ కూడా చాలా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నాయి. ఇక కీర్తి సురేష్ కూడా ఈ పాటలో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అలాగే కీర్తి సురేష్ ఇద్దరు కూడా ట్రెడిషనల్ బుక్స్ లోనే కనిపిస్తున్నాటు.

ఇక ఆగస్టు 10వ తేదీన గ్రాండ్ కా విడుదల కాబోతున్న ఈ సినిమాలో తారాగణం చాలా హైలెట్ అవుతుంది. ఈ సినిమాలో రఘుబాబు వెన్నెల కిషోర్ హైపర్ ఆది అలాగే శ్రీముఖి, గెటప్ శ్రీను కూడా కొన్ని స్పెషల్ పాత్రలలో అలరించబోతున్నారు. మెగాస్టార్ కు జోడిగా తమన్నా నటిస్తోంది. ఇప్పటివరకు దాదాపు అందరూ మెగా హీరోలతో సినిమా చేసిన తమన్న మెగాస్టార్ తో కూడా మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఈ సినిమాతో ఆమె కూడా సక్సెస్ అందుకోవాలి అని చూస్తోంది. మరి భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.