Begin typing your search above and press return to search.

తన ప్రేమ ఇలానే ఉంటుంది అంటున్న రౌడీ హీరో..!

ఈ క్లిప్ ఆరాధ్య పాటలోనిది కావడం విశేషం. విజయ్ పోస్టు చేసిన ఈ పోస్టుకి ఫ్యాన్స్ విపరీతంగా స్పందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 July 2023 10:45 AM GMT
తన ప్రేమ ఇలానే ఉంటుంది అంటున్న రౌడీ హీరో..!
X

సమంత, విజయ్ దేవర కొండ జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ మూవీ పై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా కంప్లీట్ లవ్ స్టోరీ అనే విషయం ఇప్పటికే అర్థమౌతోంది. గీతా గోవిందం తర్వాత ఆయన చేస్తున్న కంప్లీట్ లవ్ స్టోరీ ఇది కావడం విశేషం. సమంత కూడా ఏమాయ చేశావే తర్వాత ఇలాంటి ప్రేమకథలో నటించలేదు. దీంతో, వీరిద్దరి ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో మంచి నేర్పరి అయిన శివ నిర్వాణ ఈ మూవీకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో నిన్ను కోరి, మజిలీ తో హిట్ కొట్టిన ఆయన ఖుషి లో మరో అందమైన ప్రేమ కథను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కాగా, తాజాగా విజయ్ ఈ మూవీలోని ఓ చిన్ని వీడియోని షేర్ చేసి, తన ప్రేమ ఇలానే ఉంటుంది అని క్యాప్షన్ ఇచ్చారు.

వీడియోలో సమంత, విజయ్ దేవరకొండ నిద్రపోతూ ఉంటారు. నిద్రలో వారు ఒకరిని మరొకరు హత్తుకుంటూ ఉంటారు. వీడియో చాలా క్యూట్ గా ఉంది. ఈ క్లిప్ ఆరాధ్య పాటలోనిది కావడం విశేషం. విజయ్ పోస్టు చేసిన ఈ పోస్టుకి ఫ్యాన్స్ విపరీతంగా స్పందిస్తున్నారు.

కాగా, ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు విడుదల చేయగా, రెండూ బాగా క్లిక్ అయ్యాయి. జనాల్లోకి బాగా రీచ్ అయ్యాయి. మొదట నా రోజా నువ్వే పాట విడుదల చేశారు. ఆ పాట జనాలు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఇటీవల ఆరాధ్య అనే పాటను కూడా విడుదల చేశారు. అందులో, వారిద్దరి పెళ్లి అయిపోయినట్లు తెలుస్తోంది. ఆరాధ్య పాట కూడా అందరికీ తెగ నచ్చేస్తోంది. కాగా, సిద్ శ్రీరామ్ ఈ పాట పాడాడు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు.

ఈ ఖుషీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషీ మూవీ రాబోతోంది. ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతతోపాటు జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.