Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్.. బాలీవుడ్ హీరోతో ఆటోలో అలా..

దక్షిణాదిన ఓ రేంజ్ కి వెళ్లిపోయిన హీరోయిన్లు అందరూ బాలీవుడ్ లో సత్తా చాటాలని అనుకుంటూ ఉంటారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 5:23 AM GMT
కీర్తి సురేష్.. బాలీవుడ్ హీరోతో ఆటోలో అలా..
X

దక్షిణాదిన ఓ రేంజ్ కి వెళ్లిపోయిన హీరోయిన్లు అందరూ బాలీవుడ్ లో సత్తా చాటాలని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా కామన్. ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లు అలా బాలీవుడ్ లోకి వెళ్లినవారే. అలా వెళ్లి కొందరు సూపర్ సక్సెస్ అవ్వగా, కొందరు గోడకు కొట్టిన బంతిలా మళ్లీ వెనక్కి వచ్చేశారు. అయితే, ఇప్పుడు మహానటి కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది.

కీర్తి సురేష్ ఇప్పటి వరకు దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించింది. ఏ భాషలో నటించినా ఆమె నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇక, మహానటి సావిత్రి బయోపిక్ లో అయితే సూపర్ గా అదరగొట్టింది. ఏకంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఓ కథను ఆమె ఒకే చేసినట్లు తెలుస్తోంది.

దానికి సాక్ష్యంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో కీర్తి సురేష్ ఆటోలో ప్రయాణిస్తోంది. ఆమె పక్కన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఉండటం విశేషం. వరుణ్ సరసనే కీర్తి సురేష్ నటిస్తోందని ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది. మాస్ యాక్షన్ ఎంటర్ ట్రైనర్ గా ఈ మూవీ తెరరకెక్కుతోందట.

ఈ మూవీకి తమిళ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుకానుందట. అంతేకాదు, వచ్చే ఏడాది మే లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది. మరి, ఈ మూవీతో కీర్తి బాలీవుడ్ లో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక, దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇటీవలే వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా వరుణ్ ధావన్ తోనే నటింస్తుండటం విశేషం.