Begin typing your search above and press return to search.

ఇంటర్వ్యూలో జేడీ పంచ్.. వైరల్ అవుతున్న వీడియో

తాజాగా ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.

By:  Tupaki Desk   |   26 July 2023 1:17 PM GMT
ఇంటర్వ్యూలో జేడీ పంచ్.. వైరల్ అవుతున్న వీడియో
X

గులాబీ తో పాటు ఎన్నో తెలుగు సినిమాల్లో ఇతర భాషల సినిమాల్లో నటించిన జేడీ చక్రవర్తి కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయాడు. మళ్లీ ఇప్పుడు సినిమాలు.. సిరీస్ లు అంటూ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. దయా అనే సిరీస్ తో జేడీ చక్రవర్తి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు

దయా సిరీస్ ప్రమోషన్ లో భాగంగా జేడీ చక్రవర్తి గత కొన్ని రోజులుగా మీడియాలో తెగ కనిపిస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అడిగిన ప్రశ్నకు జేడీ ఇచ్చిన సమాధానం అదిరి పోయిందని... ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని చెంప మీద కొట్టినట్లుగా జేడీ సమాధానం ఉంది అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్‌ సత్య తర్వాత సక్సెస్ లేవు. అది మీకు స్క్రాప్ పీరియడ్ కదా అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

దాంతో జేడీకి కోపం వచ్చింది. వెంటనే ఆ స్క్రాప్‌ పీరియడ్ రావడం వల్లే నీ లాంటి వాళ్లతో కూడా మాట్లాడే దుస్థితి వచ్చింది కదా అన్నట్లుగా యాంకర్‌ చెంప మీద కొట్టినట్లుగా సీరియస్ గా సమాధానం ఇచ్చాడు.

జేడీ సమాధానంకు చాలా మంది సోషల్‌ మీడియా ద్వారా నైస్ షాట్‌.. సిక్స్ మారా తుమ్‌ అన్నట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు. జేడీ చక్రవర్తి వంటి ముక్కుసూటి మనిషి వద్ద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. అలాంటి స్క్రాప్‌ మాటలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక జేడీ దయా సిరీస్ విషయానికి వస్తే పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందింది. ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి కూడా సిరీస్ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌ చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో కూడా కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.