ట్రైలర్ టాక్: జంటలు విడిపోకుండా ఆపాలంటే?
జంటల మధ్య కలతలపై ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు అదే జానర్ లో మరో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 23 Sep 2023 11:30 AM GMTజంటల మధ్య కలతలపై ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు అదే జానర్ లో మరో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. విడిపోవాలనుకునే జంటలు, వారిని కౌన్సిలింగ్ చేసే కౌన్సిలర్ చుట్టూ ఈ సినిమా కథాంశం ఆసక్తిని కలిగిస్తోంది. జంటల్ని కలిపేందుకు ఫ్యామిలీ కౌన్సిలర్ అవసరం ఎంత? అన్న పాయింట్ ని ఇందులో టచ్ చేస్తుండడం ఆసక్తికరం.
సీనియర్ నటుడు ప్రభు నటవారసుడు విక్రమ్ ప్రభు నటించిన తాజా చిత్రం `ఇరుగపాట్రు` అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో ఎలి, పొట్ట పొట్టి, తెనాలిరామన్ వంటి చిత్రాలను రూపొందించిన యువరాజ్ ధయాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఇరుగపాట్రు ట్రైలర్ విడుదలైంది. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం మూడు జంటల జీవితాల్లోని ఆసక్తికర డ్రామా నేపథ్యంలో రక్తి కట్టిస్తుందని ట్రైలర్ చెబుతోంది. ఇందులో విదార్త్, సానియా అయ్యప్పన్, అబర్నతి, శ్రీ, తదితరులు నటించారు. కాపురంలో డిఫరెన్సెస్ వల్ల మూడు జంటలు ఎలా మారాయి? అనే అంశం చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరుగుతుందని ట్రైలర్‌లో వెల్లడైంది. రిలేషన్‌షిప్‌లో సాధారణ అనుభవాలను తెరపై చూపారు.
ప్రేమలో పడిన కొత్తలో, ఎంజాయ్ చేసే రోజుల్లో బాగానే ఉంటుంది. ఒకసారి పెళ్లయి కాపురం మొదలయ్యేకే టార్చర్ లా ఉంటుంది. అందుకే కాపురంలో కలతలు మొదలవ్వక ముందే సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ అవసరం ఎంతో ఉందని ఇటీవల నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ కౌన్సిలర్ గా శ్రద్ధా శ్రీనాథ్ పాత్రకు చాలా ప్రాధాన్యత కనిపిస్తోంది.. ఆమె భర్తగా విక్రమ్ ప్రభు నటించారు. పొటెన్షియల్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫాం చేజిక్కించుకుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జెవి మణికంద బాలాజీ ఎడిటింగ్ .. గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.-