Begin typing your search above and press return to search.

మర్చిపోలేని అనుభూతినిచ్చి మనసు దోచేసిన ఇండిగో

ఇండిగో.. ఆ కుటుంబానికి మర్చిపోలేని అనుభవాన్ని మిగల్చాలని భావించారు.

By:  Tupaki Desk   |   24 July 2023 4:58 AM GMT
మర్చిపోలేని అనుభూతినిచ్చి మనసు దోచేసిన ఇండిగో
X

విమాన ప్రయాణం అన్నంతనే ఏదో ఒక రచ్చ ఈ మధ్యన కామన్ అయిపోయింది. అయితే.. ఎయిర్ లైన్స్ వాళ్లు.. లేదంటే ప్రయాణికులు చేస్తున్న పనులు వార్తలుగా మారుతున్నాయి. ఇందుకు భిన్నంగా.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో అనూహ్యమైన నిర్ణయంతో అందరి మనసుల్ని దోచేసింది ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ. తమ విమానంలో ప్రయాణిస్తున్న ఒక చిన్నారికి జీవితాంతం మర్చిపోలేని అపురూపమైన గిఫ్టును అందించింది. దీని గురించి తెలిసిన వారంతా ఇండిగో చేసిన పనికి ఫిదా అయిపోతున్న పరిస్థితి.

ఇంతకూ జరిగిందేమంటే.. బ్యూలా లాల్ అనే చిన్నారి తమ విమానంలో ప్రయాణించే రోజునే మొదటి పుట్టినరోజు అన్న విషయాన్ని తెలుసుకున్న ఇండిగో.. ఆ కుటుంబానికి మర్చిపోలేని అనుభవాన్ని మిగల్చాలని భావించారు.

ఇందులో భాగంగా.. విమాన ప్రయాణానికి ముందే అన్నీ సిద్ధం చేశారు. కరాచీ ఎయిర్ పోర్టుకు వచ్చినంతనే సదరు చిన్నారి చేత కేక్ కట్ చేయించిన ఇండిగో సిబ్బంది పనితో.. చిన్నారి కుటుంబం తెగ సంతోషపడిపోయింది.

అంతేకాదు.. ఇండిగో చేసిన పనికి.. ప్రయాణికులు సైతం ఫిదా అయ్యారు. విమానం ఎక్కిన తర్వాత కూడా.. పుట్టిన రోజు చిన్నారిని ఎత్తుకున్న ఎయిర్ హోస్టెస్.. ఆమెను తనతో పాటు కేబిన్ లోకి తీసుకెళ్లారు.

ఆమెతో పాటు పైలెట్ బయటకు వచ్చి.. స్వయంగా మైకు అందుకొని.. చిన్నారి పుట్టిన రోజు విషయాన్ని అనౌన్స్ చేయటమే కాదు.. ఆమెకు ప్రయాణికులు అంతా ఆశీర్వదించాలని కోరారు. దీంతో.. విమానంలో సందడి వాతావరణం నెలకొంది.

దీనికి సంబంధించిన రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. ఈ ఉదంతం వైరల్ గా మారింది. మొత్తంగా ఇండిగో చేసిన పనికి చిన్నారి కుటుంబం మాత్రమే కాదు.. ప్రయాణికులు..ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ఫిదా అయిపోతున్న పరిస్థితి.