Begin typing your search above and press return to search.

హర్షసాయి మెగా టీజర్.. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడేంటి

హర్షసాయి.. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఈ పేరు తెలిసే ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 Sep 2023 10:44 AM GMT
హర్షసాయి మెగా టీజర్.. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడేంటి
X

హర్షసాయి.. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఈ పేరు తెలిసే ఉంటుంది. కష్టాల్లో ఉన్నవారికి నోట్ల కట్టలు పంచి వారిని సర్ ప్రైజ్ చేయడం, నిరుపేద జీవితాల తలరాతను రాత్రికి రాత్రే మార్చేసి, వారి ముఖాల్లో ఆనందాన్ని చూడటం వంటి వీడియోస్ చేస్తూ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు.

అయితే గత కొద్ది రోజులుగా కనపడటం తగ్గించాడీ యూట్యూబర్ దానకర్ణుడు. తాజాగా చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించాడు. అయితే ఈ సారి నోట్ల కట్టలు పంచే వీడియోలతో కాదు సినిమా టీజర్ తో. ఇప్పుడతడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా ఏకంగా పాన్‌ ఇండియా సినిమాతో అని అంటున్నారు. హర్షసాయి స్వీయ దర్వకత్వంలోనే సినిమా తెరకెక్కడం విశేషం.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాకు మెగా అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. ఏంటి డాక్టర్‌? ఏమీ అర్థం కావడం లేదు అని ఓ వ్యక్తి అడగడంతో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఓ వైపు కన్ఫ్యూజంగా ఉంటూనే డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ప్రపంచానికి తెలియని, ప్రపంచంలోని అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇదీ ఒకటి అని ఓ వైద్యుడు చెప్తున్న డైలాగ్‌తో గ్లింప్స్ కొనసాగింది.

టీజర్‌ చూస్తుంటే కాన్సెప్ట్‌ ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నట్లు అనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో డైలాగ్ లు చెబుతూ నేరేషన్ ఇవ్వడం బాగానే ఉంది కానీ సీన్లకు వాటికి పొంతన కనపడట్లేదు. విజువల్స్‌ రిచ్ గా ఉన్నాయి. ఫైనల్ గా కొంతమంది కలిసి ఓ పెద్ద గంటకు హర్షసాయిని వేలాడదీసి చంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. ఆ సమయంలో దెబ్బలతో పడి ఉన్న హర్షసాయి.. జీవితంలో ఓటమి, గెలుపు, చావు.. అంటూ ఏవో కొన్ని డైలాగ్స్ చెబుతూ కాస్త ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు.

మరో విశేషమేమిటంటే హర్ష సాయి చంపే వ్యక్తిని ఏలియన్ తరహాలో చూపించడం విశేషం. ఆ తర్వాత మళ్లీ జంతు ప్రపంచంలో అత్యంత క్రూరమైన.. అత్యంత పెద్దదైన జంతు బలంతో హీరో పాత్రను ఎలివేట్ చేశారు. అతడే మెగా లో డాన్ అంటూ.. రాక్షసులతో నిండిన సముద్రాన్ని కుదిపేసిన రాజైన మనిషి అతని తెలివితేటలు అపారమే ఈ సినిమా కథ అంటూ టీజర్ ను ముగించారు. మొత్తంగా ఈ ప్రచారం గందరగోళాన్ని క్రియేట్ చేస్తూనే కాస్త ఉత్సుకతను రేకెత్తించింది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుంతో, ఎలా ఉంటుందో..

ఇకపోతే ఈ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు సమర్పిస్తున్నారట. బిగ్‌బాస్‌ బ్యూటీ మిత్ర శర్మ తన సొంత బ్యానర్‌ శ్రీ పిక్చర్స్‌పై చిత్రాన్ని నిర్మిస్తోంది. వికాశ్ బడిసా అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు.