Begin typing your search above and press return to search.

'స్పార్క్ L.I.F.E'.. హేసమ్ అబ్దుల్ మెలోడీ బాణం​

విక్రాంత్​ హీరోగా డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్​లో భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్ర 'స్పార్క్ L.I.F.E'. లవ్ అండ్ సస్పెన్స్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్​గా సినిమాను రూపొందించారు.

By:  Tupaki Desk   |   22 Oct 2023 7:21 AM GMT
స్పార్క్ L.I.F.E.. హేసమ్ అబ్దుల్ మెలోడీ బాణం​
X

విక్రాంత్​ హీరోగా డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్​లో భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్ర 'స్పార్క్ L.I.F.E'. లవ్ అండ్ సస్పెన్స్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్​గా సినిమాను రూపొందించారు. విక్రాంత్​కు జోడీగా మెహరీన్, రుక్సర్ థిల్లాన్ నటించారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​ ప్రారంభించిన మూవీటీమ్​ వరుసగా అప్డేట్స్​ను రిలీజ్​ చేస్తోంది.

రీసెంట్​గా ట్రైలర్​ను రిలీజ్​ చేసిన చిత్రబృందం తాజాగా చిత్రంలోని థర్డ్​ సింగిల్​ను రిలీజ్​ చేసింది. జ్ఞాపకాలు పేరుతో పాటను విడుదల చేసింది. అనంత శ్రీరామ్​ లిరిక్స్ అందించారు. ఖుషి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హేసమ్ అబ్దుల్ వాహబే ఈ సాంగ్​కు మ్యూజిక్ అందించారు. అలాగే ఆయనే ఈ పాటను కృష్ణ లాస్య కలిసి ఆలపించారు. జార్జ్​ థామస్​ పీవీ కూడా సంగీతం కోసం పని చేశారు.

వండర్ ఫుల్​ మెలోడీగా ఈ పాట సాగింది. హేషమ్​ అబ్దుల్​ అందించిన మ్యూజిక్​ ఎంతో వినసొంపుగా ఉంది. అలానే అబ్దుల్ వాహబ్ అండ్ కృష్ణ లాస్య వాయిస్​, ఆలపించిన విధానం కూడా మనసును తాకేలా ఉంది. అనంత్ శ్రీరామ్​ లిరిక్స్​ ఎంతో బాగున్నాయి. విక్రాంత్​-రుక్సర్​ లవ్​ జర్నీని అద్భుతంగా ఎక్స్​ప్రెస్​ చేశాయి. ఇద్దరి మధ్య చూపించిన కెమిస్ట్రీ సాంగ్​కు హైలైట్​గా ఉంది. విజువల్స్​ కూడా ఎంతో కూల్​గా​ ప్లెజెంట్​గా ఉన్నాయి. కొండల మధ్య, పచ్చని చెట్ల మధ్య అద్భుతమైన లొకేషన్స్​లో సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇకపోతే సినిమాలో సీనియర్ యాక్టర్లు నాజర్​, సునాసిని మణిరత్నం, వెన్నెల కిశోర్​, సత్య బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగర్​, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర తదితురులు ఇతర పాత్రల్లో నటించారు. మలయాళ సీనియర్ యాక్టర్​ సోమసుందరం ప్రతినాయకుడిగా నటించారు. సినిమాను ఐదు భాషల్లో గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

కాగా, పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్​తో రీసెంట్​గా రిలీజైన ట్రైలర్​ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటినీ పెంచింది. నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ చిత్రం ఏ మేరకు ఆడియన్స్​ను ఆకట్టుకుంటుందో..