Begin typing your search above and press return to search.

చెత్త కుండీల్లో అన్‌ లాక్, డౌన్‌ లోడ్, సెర్చ్... మిస్టరీ వీడింది!

అయితే తాజాగా వీటివెనకున్న మిస్టరీ వీడిందని తెలుస్తుంది

By:  Tupaki Desk   |   22 July 2023 6:17 AM GMT
చెత్త కుండీల్లో అన్‌ లాక్, డౌన్‌ లోడ్, సెర్చ్... మిస్టరీ వీడింది!
X

గత వారం కార్ఖానా, ప్యాట్నీ, రాణిగంజ్ వంటి ప్రముఖ ప్రదేశాలతో సహా నగరంలోని వివిధ చెత్త డంప్‌ లలో "సెర్చ్", "అన్‌ లాక్", "డౌన్‌ లోడ్" అని లేబుల్ చేయబడిన పెద్ద బోర్డులు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అసలు చెత్త బుట్టలకూ ఈ సాఫ్ట్ వేర్ పదాలకూ సంబంధం ఏమిటనే చర్చ నడిచింది.

అవును... గతవారం హైదరాబాద్ లోని పలు ప్రదేశాల్లో జీ.హెచ్.ఎం.సి. ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లో "డౌన్ లోడ్", "అన్ లాక్", "సెర్చ్" వంటి అక్షరాలతో బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. అయితే తాజాగా వీటి ఏర్పాటు వెనకున్న మిస్టరీ వీడింది.

ఇదే సమయంలో ఈ బోర్డులు కేవలం హైదరాబాద్‌ నగరానికి మాత్రమే పరిమితం కాలేదు. బెంగళూరు, లక్నో, కోల్‌ కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలలో ఈ టైపు బోర్డులు కనిపించాయి. ఈ ఊహించని సంఘటన దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఉత్సుకతను రేకెత్తించింది.

ఈ సమయంలో వీటిని గురించిన చర్చ విపరీతంగా జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు పంచుకున్నారు. ఇదే సమయంలో #mysterybuttons, #buttonsdiscovered అనే హ్యాష్‌ ట్యాగ్‌ లతో ఆన్ లైన్ లో హోరెత్తించారు కూడా.

అయితే తాజాగా వీటివెనకున్న మిస్టరీ వీడిందని తెలుస్తుంది. దేశవ్యాప్తంగా చెత్త కుండీల్లో "అన్‌ లాక్", "డౌన్‌ లోడ్", "సెర్చ్" అని లేబుల్‌ తో ఉన్న జెయింట్ బటన్‌ ల మిస్టరీ మరింత విస్తృతమవుతుండగా.. స్మార్ట్ లాక్ స్క్రీన్ ప్లాట్‌ ఫాం గ్లాన్స్.. సోషల్ మీడియా ఛానెల్‌ లలో పోస్ట్ చేసిన వీడియో ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌ కు తెరదించింది.

సోషల్ మీడియా ఛానెల్‌ లలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో... ఈ జెయింట్ సింబాలిక్ బటన్‌ లను డంప్ చేస్తున్న వ్యక్తుల ఫోటోగ్రాఫ్‌ లు, వీడియోలను గ్లాన్స్ తన స్మార్ట్ లాక్ స్క్రీన్ కోసం ఉపయోగించింది. ఇందులో భాగంగా.. స్మార్ట్ లాక్ స్క్రీన్ కోసం వినియోగదారులు తమ ఫోన్‌ లను "అన్‌ లాక్" చేయడం, "డౌన్‌ లోడ్" చేయడం, విభిన్న కంటెంట్‌ ను యాక్సెస్ చేయడానికి ఇంటర్నెట్ "సెర్చ్" చేయడం అవసరం లేదని తెలిపింది.

ఈ సందర్భంగా... "మీ గ్లాన్స్ స్మార్ట్ లాక్ స్క్రీన్‌ లో తాజా ట్రెండ్‌ ల నుండి స్పోర్ట్స్ అప్‌ డేట్‌ ల వరకు, 500+ గేమ్‌ ల నుండి ఫ్యాషన్ కోసం షాపింగ్ చేయడం వరకు మీరు ఇష్టపడే ప్రతిదాన్ని పొందండి. 'అన్‌ లాక్', 'సెర్చ్', డౌన్‌ లోడ్' చేయవలసిన అవసరం లేదు. కేవలం గ్లాన్స్... ఇది చాలా స్మార్ట్ కాదా?" అని బెంగళూరుకు చెందిన యునికార్న్ స్టార్టప్ కంపెనీ వీడియోతో పాటు ట్విట్టర్ పోస్ట్‌ లో పేర్కొంది.