Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీతో భోళా కెమిస్ట్రీ.. మాములుగా లేదు

ఈ మూవీలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ మూవీలోని ఓ పాటను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   20 July 2023 1:21 PM GMT
మిల్కీ బ్యూటీతో భోళా కెమిస్ట్రీ.. మాములుగా లేదు
X


మెగా స్టార్ చిరంజీవి మంచి స్పీడు మీద ఉన్నారు. ఒక మూవీ తర్వాత మరో మూవీ లైన్లో పెడుతున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన ఆయన బోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ మూవీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఇటీవల ఆ మూవీ డబ్బింగ్ ని చిరు పూర్తి చేసుకున్నారు. ఈ మూవీలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ మూవీలోని ఓ పాటను విడుదల చేశారు.

ఈ పాటకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో తమన్నా, చిరుల లుక్ అదిరిపోయింది. చిరు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆయన బ్లాక్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించారు. ఆ టీషర్ట్ పై రెడ్ కలర్ ఈగల్ డిజైన్ చేసి ఉంది. ఆయన ముందు తమన్నా ఉన్నారు.ఆమె ఆరెంజ్ కలర్ టాప్ కి, అదే కలర్ బాటమ్ ధరించి ఉన్నారు. ఇద్దరి ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తుండటం విశేషం.

కాగా, వీరు ఈ లుక్ లో ఉన్న పాట సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘మిల్కీ బ్యూటీ .. నువ్వే నా స్వీటీ’ అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ స్వరపరిచారు. ఈ పాటను మంచు కొండల మధ్య చిత్రీకరించినట్లు తెలుస్తోంది. లొకేషన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక చిరు డ్యాన్స్ ఎలా వేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమన్నా కూడా మంచి డ్యాన్సరే కావడంతో, చిరుతో సమానంగా స్టెప్పులు వేసి అదరగొట్టింది. కాగా, ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. పూర్తి పాటను రేపు సాయంత్రం 4: 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇక, ఈ సినిమా 2015లో అజిత్ నుంచి వచ్చిన సూపర్ హిట్ 'వేదాళం' చిత్రానికి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చిరుకి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఆ గస్టులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ మూవీ తర్వాత చిరు, గోల్డ్ బాక్స్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నారు. ఈ మూవీకి బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గోల్డ్ బాక్స్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, ఆమె భర్త విష్ణుప్రసాద్ లకు చెందినది కావడం విశేషం. వీరి బ్యానర్ లో వస్తున్న తొలి సినిమా ఇది కావడం విశేషం.